NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ రెడీ చేస్తున్న వైసీపీ..??

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద శ్రీరాముని విగ్రహం ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క అధికార పార్టీ నేతలు సరిగ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరిగే సమయంలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వద్ద ఇటువంటి ఘటనలు జరగటం, ఇది ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్ర అని అభివర్ణిస్తున్నారు.

Govt is playing with Hindu sentiments: Bandi Sanjay Kumarఇప్పటికే రామతీర్థం వద్దకి చాలా మంది పార్టీ నేతలు వెళ్ళటంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి ఉప ఎన్నికలు గురించి ప్రస్తావిస్తూ.. జరగబోయే ఎన్నికలలో బైబిల్ పార్టీ కావాలా..? లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా..? అనే కామెంట్ చేయడం జరిగింది.

 

దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ నేతలు దిమ్మతిరిగే కౌంటర్ రెడీ చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబడతారని ఇరు పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. అప్పట్లో తిరుపతి సాక్షిగా తన కూతురు క్రిస్టియన్ అని ప్రకటించటం అందరికీ తెలిసిందే. దీంతో క్రైస్తవ్యాన్ని విశ్వసించే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని, తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ రెడీ అవటం లో తప్పు లేనప్పుడు.. వైసీపీ పార్టీ పై మత ముద్ర వేయడం ఏంటి అన్న తరహాలో బండి సంజయ్ ని కడిగే యటానికి వైసీపీ పార్టీ నేతలు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం మతాల పేర్లు చెప్పి రాజకీయ లబ్ది పొందడానికి బండి సంజయ్ బైబిల్ పార్టీ .. భగవద్గీత అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మతాలు పేర్లు చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఆంధ్ర వాళ్ళు తెలివితక్కువ వాళ్ళు కాదు అని, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆంధ్ర ఓటర్లకు బాగా తెలుసు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju