వైసీపీ కీలక నిర్ణయం.. ప్లీనరీలో ఎల్లుండి తీర్మానం

Share

రేపటి నుండి వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా వైసీపీ ప్లీనరీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితర నేతలు, మంత్రులు ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. 2017 లో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఆ తరువాత ఇప్పుడే ప్లీనరీ జరుగుతోంది. ఈ  సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.

 

వైసీపీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ను ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు నియామకాల నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. ఎల్లుండి వైసీపీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా తీర్మానంలో పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇకపై ప్రతి సారి జరిగే ప్లీనరీలో అధ్యక్ష లేకుండా శాశ్వత అధ్యక్షుడుగా జగన్ ను నియమిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ ప్లీనరీలో కీలక తీర్మానాలు చేయనున్నట్లు ఇప్పటికే విజయసాయి రెడ్డి ప్రకటించారు. పార్టీ నియమావళిలో సవరణలను తీసుకువస్తున్నట్లు తెలిపారు.

 

వైఎస్ఆర్ సీపీ ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుండి జగన్మోహనరెడ్డి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. కాగా ప్లీనరీలో తొలి రోజు లక్షా 50వేల మంది ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని అంచనా. రేపు, ఎల్లుండి రెండు రోజులు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్లీనరీలోనే ఉంటారని సమాచారం. వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. రేపు జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం తీర్మానాలపై చర్చ ఉంటుంది. ఎల్లుండి నేతల ప్రసంగాలు, సాయంత్రం బహిరంగ సభలో ప్లీనరీ ముగియనుంది. ఎల్లుండి బహిరంగ సభకు అయిదు లక్షలకు పైగా వస్తారని అంచనా.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

27 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

36 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago