ట్రెండింగ్ న్యూస్

Sai Dharamtej: సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై రియాక్ట్ అయిన వైసీపీ నాయకులు..!!

Share

Sai Dharamtej: మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కారణంగా.. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10 వ తారీకు కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ ప్రయాణిస్తుండగా స్కిడ్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ కి సాయి ధరమ్ తేజ్ గురికావటం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్థానికులు స్పందించి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో సాయిధరమ్ తేజ్ ప్రాణాలకు ఎటువంటి ముప్పు కలగలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో సాయిధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సెప్టెంబర్ 12 వ తారీకు కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో ఆపరేషన్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Vijayasai Reddy Should Let Go of This Trivial Mindset

ఇదిలా ఉంటే ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇంకా పలువురు రాజకీయ నాయకులు.. ఈ ఘటనపై స్పందించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై వైసిపి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఆయన ఏమన్నారంటే…..సాయి ధరమ్ తేజ్ కి జరిగిన యాక్సిడెంట్ గురించి రియాక్ట్ అయ్యారు. ప్రమాదానికి గురైన యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. బైక్ పై వెళ్లేటప్పుడు ఆయన హెల్మెట్ ధరించడం సంతోషకరమని చెప్పారు.

 

యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదే తరుణంలో వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా రియాక్ట్ అయ్యారు. ఈయన ఏమన్నారంటే… ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ కి జరిగిన యాక్సిడెంట్ నుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఎంతో మంచి నటుడు అని క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుని మళ్లీ గతంలో మాదిరిగా సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇంకా నారా లోకేష్ మరి కొంతమంది రాజకీయ నాయకులు.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Share

Related posts

WhatsApp : సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసిన వాట్సాప్..

bharani jella

నిలిచిపోయిన బ్యాంక్ సేవలు

sarath

YS Jagan: సినిమా పాలిటిక్స్ – ఆన్లైన్ టికెట్లు అసలు సమస్య..!!

Srinivas Manem