NewsOrbit
న్యూస్

‘లింగమనేనికి ఆర్‌కె సవాల్!’

అమరావతి: పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఉండవల్లి గ్రామ పంచాయతీ నుండి కరకట్టపై భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదనీ ఈ విషయంపై బహిరంగ విచారణకు తాను సిద్ధమనీ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తన అతిధి గృహానికి  చట్టపరమైన అనుమతులు ఉన్నాయనీ, ప్రభుత్వం అనుసరిస్తున్న కూల్చివేత ధోరణి వల్ల అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనీ పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లింగమమేని రమేష్ అయిదు పేజీల లేఖ రాయడంపై ఆర్కే స్పందించారు.

బుధవారం ఉదయం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ, లింగమనేని రమేష్  జి ప్లస్ 1 నిర్మాణానికి అనుమతి ఉందంటున్నారు. కానీ ఇక్కడ నిర్మించింది జి ప్లస్ 2 భవనమని పేర్కొన్నారు. ఆయనకు ఉన్న అనుమతి కేవలం స్విమ్మింగ్ ఫూల్‌కు మాత్రమేనని ఆర్కే స్పష్టం చేశారు. తాను ఉండవల్లి పంచాయతీ రికార్డులను పరిశీలించాననీ, ఆయన భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు గానీ, బిల్డింగ్ ఫీజు చెల్లించినట్లు గానీ రికార్డుల్లో లేదని ఆర్కే తెలిపారు.

వైసిపి ప్రభుత్వం చట్టానికి లోబడి పని చేస్తుంటే టిడిపి బురదజల్లే ప్రయత్నం చేస్తుందంటూ ఆర్కే విమర్శించారు.

ఈ గెస్ట్ హౌస్‌ను గతంలో తాను ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు, ఆ భవనంతో తనకు సంబంధం లేదని ఇదే లింగమనేని పేర్కొన్నట్లు వీడియో సాక్షం ఉందనీ, అదే విధంగా

శాసనసభ సాక్షిగా నాడు చంద్రబాబు కూడా అది ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారనీ  ఇప్పుడేమో తనదే గెస్ట్ హౌస్ అంటూ లింగమనేని రావడం విడ్డూరంగా ఉందని ఆర్కే అన్నారు. లింగమనేని రమేష్‌తో చంద్రబాబు ఆ లేఖ రాయించి ఉంటారనీ ఆర్‌కె అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పుకున్న లింగమనేని ఇప్పుడు లేఖ ఎలా రాశారని ఆర్కే ప్రశ్నించారు. రమేష్ రాసిన లేఖలో ఆ గెస్ట్ హౌస్‌ను యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయడం కోసం నిర్మించామని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని ఆర్కే అన్నారు. రెవెన్యూ సర్వే నెం.271 ప్రభుత్వ భూమిగా అడంగళ్‌లో ఉందనీ, దీనిపైనా విచారణ జరిపిస్తామనీ తెలిపారు. ప్రభుత్వ భూమి ఎంత ఆక్రమించారనే విషయంపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి కోరతానని ఆర్కే చెప్పారు. ఒక వేళ అక్కడ లింగమనేని రమేష్ భూమి కొనుగోలు చేసినా అది రెవెన్యూ రికార్డులో వ్యవసాయ భూమిగా ఉంటుందనీ, ల్యాండ్ కన్వర్షన్‌కు  ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకున్న దాఖలాలు కూడా లేవనీ ఆర్కే అన్నారు. కరకట్టపై భవన నిర్మాణానికి సంబంధించి లింగమనేని రమేష్‌కు ఎటువంటి అనుమతులు లేవని రుజువు చేయడానికి తాను సిద్ధమనీ, ఆయన వద్ద ఉన్న రికార్డుతో బహిరంగ చర్చకు రావాలనీ ఆర్కే సవాల్ విసిరారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Leave a Comment