NewsOrbit
న్యూస్

‘పల్నాడుపై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం’

అమరావతి: ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబు పల్నాడుపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారనీ వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు వైసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అత్మకూరులో, పల్నాడులో ఏమి జరగకపోయినా చంద్రబాబు, టిడిపి నేతలు అక్కడ ఏదో జరుగుతోందంటూ విషపు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆరోపించారు.

చంద్రబాబు పాలనలో పల్నాడు ప్రాంతంలో యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు, ఆంజనేయులు, పుల్లారావు  తదితర టిడిపి నేతల కనుసన్నల్లో అనేక ఘోరాలు, నీచమైన పనులు జరిగాయని, వారి బాధితులు ఎంతో మంది ఉన్నారని అంబటి అన్నారు. ఆ టిడిపి నేతల బాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో  చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించడానికి చలో ఆత్మకూరు అంటూ డ్రామాలు అడుతున్నారని అంబటి విమర్శించారు. తమ పార్టీ కూడా చలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చిందనీ, ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బాధిత వైసిపి శ్రేణులకు పిలుపు నివ్వగా  పెద్ద సంఖ్యలో టిడిపి బాధితులు పార్టీ కార్యాలయానికి వచ్చారనీ అంబటి చెప్పారు.

తాము చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నామని అంబటి అన్నారు. చంద్రబాబు వెళ్లినా వెళ్లకున్నా తాము పోలీసుల అనుమతితో త్వరలో ఆత్మకూరు వెళ్లి బాధితులను సమావేశపరుస్తామనీ,  బహిరంగ విచారణ జరిపి అక్కడ ఏమి జరుగుతుందో వాస్తవ పరిస్థితులను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామని అంబటి పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పినట్లుగా ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఎ విధమైన ఘోరాలు జరగడం లేదనీ, ఎవరినీ వేధించడం లేదనీ అంబటి అన్నారు. పల్నాడులోని పలు గ్రామాల్లో వూర్వం నుండి ఫ్యాక్షన్ ఉన్నమాట వాస్తవమేననీ, చంద్రబాబు హయాంలో  మాచర్లలో ఒకే రోజు ఏడు హత్యలు జరిగాయనీ అంబటి గుర్తు చేశారు. ఆత్మకూరులోనూ కొంత ఫ్యాక్షన్ ఉన్నదని ఆయన అన్నారు. టిడిపి విషపు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంబటి పేర్కొన్నారు.

సమావేశంలో వైసిపి ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ముస్తఫా, విడతల రజిని తదితర నేతలు పాల్గొన్నారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

Leave a Comment