NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

షూటింగ్ లో బిజీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే..!

సినిమా నటులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం చాలా సాధారణమైన విషయం కానీ ముందు రాజకీయ నాయకుడిగా తమ పయనం మొదలు పెట్టి ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించడం అనేది చాలా అరుదు. ఎవరైనా సరే తమ జీవితంలో ఒకసారి కళాపోషణ మీద మనసు పెడితే దానిని ఆ మనిషి నుండి దూరం చేయడం చాలా కష్టం. అందుకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కన్నా అతను సినిమా వాడిగానే ఎక్కువగా ఆదరించబడుతున్నాడు.

 

తాజాగా వైసీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా మొహానికి రంగు అద్దాడు. గిరిజనుల ఇలవేల్పు జై మోదకొండమ్మ గురించి తీస్తున్న సినిమాలో సద్గురువు పాత్రలో కరణం గారు నటించడం గమనార్హం. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే నంది అవార్డు నటుడు. 2009లో ధర్మ శ్రీ నటించిన దుర్గి సినిమా లో అతని నటనకు బంగారు నంది అవార్డు లభించింది. చిన్నప్పటి నుండి నాటకాలు వేసిన ఈయనకు నటనలో మంచి ప్రవేశం ఉంది. ఇక వెండితెరపై ఇదే అతని తొలి సినిమా.

పవిత్ర శ్రావణ మాసం కారణంగా తాజాగా షూటింగ్ మొదలు చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గాజువాకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఎమ్మెల్యే ధర్మశ్రీ పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పోలాకి శివ ఈ సినిమా దర్శకుడు. ఎమ్మెల్యే ఇంటివద్ద సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. 2004లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన ధర్మశ్రీ అంతకుముందు కాంగ్రెస్ తరఫున గెలిచారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రలో ఆయన నటించగా.. ఆయన నటనకు మెచ్చిన వైఎస్ అప్పటినుండి ఆయనను అన్నమయ్య అని పిలిచేవారట. హార్మోనియం, తబలా కూడా వాయించగల ధర్మ శ్రీ…. హరికథలు కూడా చెప్పగలరు. రచయితగా.. కవిగా కూడా మంచి పేరుంది.

author avatar
arun kanna

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju