NewsOrbit
న్యూస్

‘నిస్పృహతోనే రాద్ధాంతం’

అమరావతి: రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన అక్కసుతోనే టిడిపి శాసనసభలో రాద్ధాంతం చేస్తోందని వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆమె మాట్లాడుతూ సభా సాంప్రదాయాల గురించి చంద్రబాబు, ఆ పార్టీ సభ్యులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. బడ్జెట్‌పై మాట్లాడే ధైర్యం లేక చంద్రబాబు పారిపోయి బుచ్చయ్యచౌదరికి మైక్ ఇచ్చారని రోజా ఎద్దేవా చేశారు. నేడు సభ సక్రమంగా జరగకుండా చేయడం కోసమే శాంతి భద్రతలపై టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చి రాద్ధాంతం చేస్తోందని రోజా ఆరోపించారు. ఐదేళ్ల పాటు వారు సభలో ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని రోజా అన్నారు. ఏమి తెలియని నంగనాచిలాగా వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని రోజా దుయ్యబట్టారు. గత సభలో అచ్చెన్నాయుడు మాట్లాడిన భాష, ప్రదర్శించిన హావభావాలు అందరికీ తెలుసునని రోజా అన్నారు.

జగన్ గురించి గతంలో అచ్నెన్నాయుడు సభలో మాట్లాడిన భాష సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని  రోజా గుర్తు చేశారు. వారు ప్రవర్తించిన తీరు వల్లనే ప్రజలు ఛీకొట్టారనీ, టిడిపిని 23 సీట్లకే పరిమితం చేశారని రోజా అన్నారు. ప్రజలు చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని రోజా పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment