YCP MLA RK Roja: జల వివాదంలో తెలంగాణ వాళ్లు ఇష్టానుసారంగా చేస్తే సీఎం జగన్ సహించరంటూ రోజా హెచ్చరిక

Share

YCP MLA RK Roja: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. అటు అధికార టీఆర్ఎస్, ఇటు అధికార వైసీపీ నేతల మాటల యుద్ధం జరగుతోంది.  ఇరు ప్రాంత నాయకుల ఘాటైన విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క విమర్శలు, ప్రతివిమర్శలపై ప్రతిపక్షాలు మాత్రం ఇది టీఆర్ఎస్, వైసీపీ డ్రామా అని కొట్టిపారేస్తున్నాయి.

YCP MLA RK Roja comments on water dispute

Read More: CMRF Sanctioned to Kathi Mahesh: కత్తి మహేశ్ వైద్య ఖర్చులకు రూ. 17లక్షల మంజూరు చేసిన జగన్ సర్కార్

కాగా ఈ జల వివాదంపై తాజాగా సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల జల వివాద విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు లాగడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్ ను విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని హెచ్చరించారు. కృష్ణా జలాలలను తెలంగాణ అక్రమంగా వాడుకోవడం ఆంధ్రాకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. రెండ రాష్ట్రాలకు సంబందించిన ప్రాజెక్టులో ఏకపక్షంగా జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏపికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాన మంత్రి మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖలు రాశారన్నారు. కృష్ణా బోర్డు నిర్ణయాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవరిస్తోందని మండిపడ్డారు రోజా.

కృష్ణానదిపై పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఏపి ప్రభుత్వం చేపడుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవల దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానిపై ఏపి మంత్రులు కౌంటర్ విమర్శలు చేస్తున్నారు.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

14 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

47 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

48 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago