NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ పై వైసిపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు! వేల కోట్ల రూపాయలు వృథా అని వేదన!

Corona Vaccine : లోక్‌సభలో జరిగిన వైద్య ఆరోగ్య రంగంపై జరిగిన చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కోవిడ్ టీకా కోసం 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పనికిరాని చర్య అని, ఈ టీకా ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని సంజీవ్ వ్యాఖ్యానించారు.మహమ్మారి కరోనా నుంచి అధిగమించడానికి కోవిడ్ వ్యాక్సిన్ కవరేజీని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను కోరుతుండగా,  పార్లమెంటులో మాట్లాడుతూ ఎంపీ డాక్టర్ సంజీవ్ టీకాల డ్రైవ్‌లో ప్రభుత్వం రూ .35,000 కోట్లు వృథా ఖర్చు చేస్తోందని అనడం గమనార్హం.

YCP MP sensational comments on corona vaccine!
YCP MP sensational comments on corona vaccine!

కోవిడ్ టీకా డ్రైవ్‌లో రూ .35 వేల కోట్లు వృథా చేయవద్దని, బదులుగా ఆ డబ్బును దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఉపయోగించుకోవాలని ఎంపీ సంజీవ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఒక్క వ్యక్తికి టీకాలు వేయడం సాధ్యం కాదు అని, టీకా డ్రైవ్ కార్యక్రమం వల్ల “డబ్బు వృధా” అవుతుందని వృత్తిరీత్యా డాక్టరైన కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ లోక్ సభలో అన్నారు.

Corona Vaccine : అది కూడా ప్రమాదకర నిర్ణయమే!

అయితే, ప్రభుత్వం దేశంలో కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో సఫలం అయ్యిందని, అభివృద్ధి చెందిన దేశాల కంటే మరణాలు చాలా తక్కువగా మన దేశంలో నమోదు అయినట్లు సంజీవ్ చెప్పుకొచ్చారు.మూడేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన ఆయుర్వేద వైద్యులకు 60 రకాల శస్త్రచికిత్సలను అనుమతించాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద కేవలం 40 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.ప్రభుత్వాసుపత్రులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

చర్చనీయాంశమైన సంజీవ్ వ్యాఖ్యలు!

పార్లమెంటులో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిధుల కోసం డిమాండ్లపై చర్చ సందర్భంగా సంజీవ్ ఈ వ్యాఖ్యలు చేశారు .2021-22 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ -19 టీకా కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ .35,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.కోవిడ్ -19 వంటి మహమ్మారి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అందువల్ల అంత ప్రాముఖ్యత ఇవ్వరాదని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పగా ఈ మాటలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు గత ఏప్రిల్‌లో కోవిడ్ -19 బారిన పడి కోలుకున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N