NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డి గారి వింత వ్యాఖ్యలు..!!

 

ఈ ఏడాది మార్చి నెలలో టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం ఆ తరువాత మద్దాలి గిరిధర్, ఇటీవల వాసుపల్లి గణేష్ లు వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి నేడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారు అవుతారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నట్లా? లేక టీడీపిలో ఉన్నట్లా? విజయసాయిరెడ్డి గారే చెప్పాలి.

ఈ నెల మూడవ తేదీన విశాఖకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారని వార్తలు హాల్ చల్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే వైసీపీలోకి చేరడానికి అవకాశం ఉంటుందన్నారు.

తమ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంది, వ్యక్తుల కోసం పార్టీ సిద్ధాంతం మార్చుకోలేమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన మెచ్చి చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ చేరడానికి ఆశక్తి చూపిస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి.   కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిశీలనలో ఉన్నాయనీ, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ఆయన  తీసుకుంటారనీ తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు కానీ పార్టీ కండువాలు కప్పుకోలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుండి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడగా వారి కుటుంబ సభ్యులను వైసీపీలో అధికారికంగా చేర్చారు.

అయితే ఇతర టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగా గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరనున్నట్లు గానీ చేరనట్లు గానీ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేయలేదు. దీంతో రేపు గంటా చేరిక ఉన్నట్లా? లేనట్లా? అనేది తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.

author avatar
Special Bureau

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju