రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్థానం

Share

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణం చేశారు.  ఏపి నుండి తనను మరో సారి రాజ్యసభ సభ్యుడిని చేసిన సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు. ఇకపై తన బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నానన్నారు.

 

కాగా పునఃవ్యవస్థీకరించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో తనకు అవకాశం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి, రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పునఃవ్యవస్థీకరించారు. తనతో పాటు ప్యానల్ లో చోటు దక్కించుకున్న ఇతర సభ్యులకు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో విజయసాయిరెడ్డితో పాటు భుభనేశ్వర్ కల్లిటా, తిరుచి సిల్వా, సస్మిత్ పాత్రా, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, ఇందు బాలా గోస్వామి సభ్యులుగా అవకాశం దక్కించుకున్నారు.

మరో పక్క రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో వైసీపీ సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటు వేయడం జరిగిందనీ, ఈ ఎన్నిక ద్వారా తొలి సారిగా ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి కాబోతున్నారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

 


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

45 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

48 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago