YCP Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణా రాజకీయ నాయకులు వేలు పెట్టరు. తెలంగాణా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు వేలు పెట్టరు. కానీ అప్పుడప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనపై కవ్విస్తుంటారు. పంచ్ లు వేస్తుంటారు. నీరు, విద్యుత్ విషయంలో ఏదయినా సమస్య వచ్చిన సమయంలో ఘాటుగా విమర్శించుకుంటారు. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటారు. అయితే ఇదంతా చిన్ని సైజ్ డ్రామా, కట్టుకధ అంటుంటారు విశ్లేషకులు. ఈ రెండు పార్టీల మధ్య, ఆ పార్టీ నేతల మధ్య డీప్ గా అండర్ స్టాండింగ్ ఉంది. డీప్ గా స్నేహం ఉంది. ఇద్దరు నేతల మధ్య మంచి అవగాహన ఉంది అని చెప్పవచ్చు. ఇందుకు ఒ ఉదాహరణ కూడా ఉంది.
ఆర్ కృష్ణయ్య కు వైసీపీ రాజ్యసభ ఇవ్వడం వెనుక ఉద్దేశం, అంతర్యం ఏమిటి..? కేవలం బీసీ కోణంలోనే ఇచ్చారా..? లేక డబ్బులు తీసుకొని ఇచ్చారా..? టీడీపీ సోషల్ మీడియాలో ఆర్ కృష్ణయ్య వద్ద డబ్బులు తీసుకొని రాజ్యసభ ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇచ్చి రాజ్యసభ తీసుకోవడానికి ఆయన కార్పొరేట్ శక్తి కాదు. పెద్ద వ్యాపార వేత్త కాదు. ఆయన వేల కోట్లు బ్యాంకు ల నుండి రుణాలు తీసుకోని ఎగవేసిన చేసిన నాయకుడు కాదు. ఆయన కేవలం ఉద్యమ నేత గానే అందరికి తెలుసు. ఆయన వద్ద వందలు వేల కోట్ల ఆస్తులు లేవు. ఆర్ కృష్ణయ్య డబ్బులు ఇచ్చి రాజ్యసభ తీసుకున్నారు అనేది పచ్చి అబద్దం. అవాస్తవం.
బీసీ కోటాలో ఇచ్చారు అని అంటున్నారు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వైసీపీలో బీసీ నేతలు లేరా..? ఏపీలోని వైసీపీ లో చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు కాదా..? వీళ్లలో ఎవరికైనా ఇవ్వచ్చు కాదా..? ఎందుకు ఇవ్వలేదు అన్నది ఆలోచించాలి. అయితే కెసిఆర్ సిఫార్సు మేరకు జగన్ ఆర్ కృష్ణయ్య కు రాజ్యసభ ఇచ్చారు అని అనుకుంటున్నారు. కేసీఆర్ యే ఆయనకు రాజ్యసభ ఇవ్వచ్చు కాదా..? సిఫార్సు చేయాల్సిన అవసరం ఏముంది అని డౌట్ అనుమానం రావచ్చు. కానీ కేసీఆర్ తెలంగాణా లో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలను ముందుగా కమిట్మెంట్ ఇచ్చారు. పార్టీకి ఆర్ధిక దన్నుగా ఉండే ప్రముఖులకు ముందే మాట ఇచ్చారు. హెటిరో పార్ధసారధి రెడ్డి కి రాజ్యసభ ఇచ్చారు కేసీఆర్. మిగతా మిగతా ఇద్దరు కూడా ఆర్ధికంగా అండగా నిలిచే వారే. ఆర్ కృష్ణయ్య కు రాజ్యసభ ఇప్పించడం ద్వారా తెలంగాణా లో టీఆర్ఎస్ కు కొంత మేర లాభం ఉంటుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా పరోక్షంగా బీసీ సంఘం నేతగా కృషి చేస్తేనే టీఆర్ఎస్ కు లాభం కలుగుతుంది అన్న భావన అయి ఉండవచ్చు. ఇటు ఆంధ్ర లోనూ జాతీయ బీసీ సంఘ నేతకు ఇచ్చిన పేరు ఉంటుంది. అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీ కి ఉపయోగపడే రాజకీయ ఎత్తుగడ (వ్యూహం) లో భాగమే ఇదీ అన్నది అంతర్గత టాక్.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…