అవును ఆవులే ముఖ్యం!

మనుషుల ప్రాణాల కంటే బీజేపీ సర్కార్ కు ఆవులపైనే శ్రద్ధ ఎక్కువ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీధుల్లో ఎవరూ పట్టించుకోకుండా తిరిగే గోవుల పట్ల సరైన శ్రద్ధ తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలో ఉన్న మేత మైదానాలను ఖాళీ చేయించాలని ఈ రోజిక్కడ సీనియర్ అధికారులతో జరిపిన సమావేశంలో ఆదేశించారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ పట్టించుకోకుండా వీధుల్లో తిరుగుతున్న గోవుల కోసం 750 షెల్టర్లు నిర్మించాలని, అందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆ గోరక్షణ శాలల్లో గోవులకు అవసరమైన మేత,, నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గోరక్షణ శాలల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకూ లక్నో, బరేలిలో మాత్రమే వీటి నిర్మాణం పూర్తయ్యిందని, మిగిలిన ప్రాంతాలలో కూడా వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

SHARE