NewsOrbit
న్యూస్

అవును.. ఆమెకు అవమానం జరిగింది ! ఎవరికి ? ఎక్కడ ?

రాష్ట్ర హోం మంత్రి ,ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత ప్రీతిపాత్రురాలైన మహిళా నాయకురాలు మేకతోటి సుచరిత కు తీవ్ర అవమానం జరగటం పార్టీలో చర్చనీయాంశమైంది.అది కూడా సుచరిత సొంత జిల్లా అయిన గుంటూరులో జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 


విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మేక‌తోటి సుచ‌రిత వైఎస్సార్ సీపీలో కీల‌క నాయ‌కురాలిగా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ అంటే ప్రాణం పెడ‌తారు. పార్టీ కోసం ఎంతో శ్ర‌మించారు. గ‌త ఐదేళ్ల‌లో పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డంతోపాటు.. జ‌గ‌న్ కుటుంబ స‌మ‌స్య‌ల్లోనూ భాగ‌స్వామ్యం పంచుకున్నారు.బ‌హుశ ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఆమెకు గౌర‌వ‌మిచ్చారు. ఏకంగా హోంశాఖ‌ను ఆమెకు అప్ప‌గించారు. ఇంత ప్రాధాన్యం ఉన్న సుచ‌రిత‌కు సొంత జిల్లాలోనే అవ‌మానం జ‌రిగింద‌నే వార్తలు రావ‌డంతో పార్టీలోను, జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. మారింది. విష‌యం ఏంటంటే.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో రెండు రోజుల కింద‌ట `ఇన్నోవేష‌న్ అండ్ ఇంక్యుబేష‌న్‌` భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగింది. దీనికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే నిధులు కేటాయించింది. దీనిలోకొంత భాగం కేంద్రం కూడా స‌మ‌కూర్చింది. అయితే, ఈ కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని.. ప్ర‌భుత్వం ఆదేశించింది.

ఒక యూనివ‌ర్సిటీలో ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావ‌డంతో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆహ్వాన ప‌త్రాలు ముద్రించారు. మీడియాకు కూడా ఆహ్వానాలు కూడా పంపించారు. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారం కూడా యూనివ‌ర్సిటీ ఇంచార్జ్ వైస్ చాన్సెల‌ర్ నేతృత్వంలో సాగింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. స‌ద‌రు ఆహ్వాన ప‌త్రంలో జిల్లాకు చెందిన ఏకైక మంత్రి సుచ‌రిత పేరు లేక‌పోవ‌డం వివాదానికి దారితీసింది.ఉద్దేశ పూర్వ‌కంగానే ఆమె పేరు వేయ‌లేద‌ని ఆమె అనుచ‌రులు గొడ‌వ‌కు దిగిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ విష‌యం పార్టీ అధిష్టానం వ‌ర‌కు వెళ్ల‌డంతో కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ వెళ్ల‌వొద్ద‌ని ఆదేశాలు వ‌చ్చాయి. ఫ‌లితంగా కార్య‌క్ర‌మం మొత్తం కూడా వీసీ చేతుల మీదుగా నిర్వ‌హించి మ‌మ అనిపించారు. అయితే, మంత్రికి జ‌రిగిన అవ‌మానం మాటేంట‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మిగల‌డం విశేషం.ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి!



 





   

 

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju