హాస్పిటల్ లో రోగుల మరణాన్ని అంచనా వేయడానికి గూగుల్ ‘మెడికల్ బ్రెయిన్’ బృందం ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న మెషిన్ల కన్నా ఇది చాలా కచ్చితమైన ఫలితాన్నితెలియచేస్తుంది. ఈ ఫలితాలు వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యపరిచాయి. గూగుల్ యొక్క మెడికల్ బ్రెయిన్ బృందం తయారు చేసిన ఈ పరికరం డాక్టర్లకు ఎంతో సహాయపడుతుంది.
ఏ పరికరం సహాయం తో రోగం యొక్క మూలాన్ని అంచనా వేయవచ్చు. ప్రజలు హాస్పిటల్ లో ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం వారు బ్రతుకుతారు వంటి ముఖ్యమైన విషయాలను ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు.
మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఒక మహిళపై కేస్ స్టడీ చేశారు. ఇందుకోసం గూగుల్ తన అల్గోరిథంను ఉపయోగించింది. ఆమె హాస్పిటల్ లో చేరిన 24 గంటల తర్వాత చనిపోయే అవకాశం 19.9 శాతం ఉంటుందని గూగుల్ అంచనా వేసింది. హాస్పిటల్ అంచనా వేసిన 9.3 శాతం అంచనాకు ఇది పూర్తి విరుద్ధం. హాస్పిటల్ లో చేరిన 10 రోజుల్లోనే ఆమె మరణించింది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, న్యూరల్ నెట్వర్క్ ఈ సమాచారం మొత్తాన్ని అంచనాల కోసం సేకరించడమే కాదు, ఇది ఏ రికార్డుల నుండి దాని నిర్ణయాలను తీసుకుంటుందో, అంచనాలను కూడా తిరిగి లింక్ చేస్తుంది. దీనివలన ఇది మరింత నమ్మదగినది గా కనిపిస్తుంది. ఇది ఇప్పడు ఉన్న పద్ధతుల కంటే వేగంగా మరియు ఖచ్చితమైనదిగా నిరూపించబడింది.
అయితే, ఆరోగ్య సంరక్షణలో AI ని ఉపయోగించడం ఒక సవాలుగా మిగిలిపోతుంది, ఎందుకంటే ఇది మొత్తం యంత్రం మీదనే ఆధారపడి ఉంటుంది. రోగి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… చివరికి ఇలా మరణాలను కూడా పక్కాగా అంచనా వేయడం కొందర్ని ఆందోళనకు గురిచేస్తుంది.