ఆఫ్ రోడ్డు వాహనాలకు మహీంద్రా పెట్టింది పేరు..! మహీంద్రా వాహనాలు అత్యంత ప్రమాదకర రహదారుల్లో సునాయాసంగా ప్రయాణించగలవు అన్న విషయం అందరికీ తెలిసిందే.. అటువంటి ఎన్నో సంఘటనలు కూడా మనం చూశాం..సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతంలో రహదారులు చాలా ప్రమాదకరమైనవి.. తాజాగా ఇప్పుడు అత్యంత ప్రమాదకర కాలిబాట పర్వత రహదారిని దాటుతున్న వీడియో నెటిజన్లను అబ్బురపరిచింది..!
అత్యంత ప్రమాదకరమైన హిమాలయ పర్వత ప్రాంతం యొక్క సరిహద్దులను పంచుకునే దేశాలలో ఒకటైనా నేపాల్ లో ఈ సంఘటన నెలకొంది. ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన పర్వత కాలిబాటకు ప్రసిద్ధి చెందిన చోట ఈ వీడియోను చిత్రీకరించారు. ఇంత ప్రమాదకరమైన రోడ్డు లో మహేంద్ర కారు జలపాతంలో మీరు వేగంగా వస్తున్నప్పటికీ ఎంతో సునాయాసంగా రోడ్డుపై నడుస్తుంది అందుకే ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.ఇటువంటి ప్రమాదకరమైన రోడ్డు పై డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. అంతేకాదు ప్రాణాంతకం కూడా. కానీ డ్రైవర్ ఇక్కడ చాలా నైపుణ్యంగా, అధిక వేగంతో ప్రవహించే నీటి ప్రవాహాన్ని కూడా దాటి వెళ్ళాడు. ఈ వీడియోలో కనిపించే గారు మహీంద్రా సవారీ.
ఈ కారు ఎలాంటి కఠినమైన రోడ్లో ప్రయాణించడానికి కైనా చాలా అనుకూలంగా ఉంటుందని పర్వత ప్రాంతాల్లో ఉండే వారు ఎక్కువ ఈ విధమైన ఎస్ యువి, ఎమ్ యువి లను ఎక్కువగా మక్కువతో కొనుగోలు చేస్తుంటారు. ఈ మహీంద్రా రైడర్ అత్యంత వేగంగా ప్రవహించే నదీ ప్రవాహ రోడ్డును దాటడం నిజంగా అభినందనీయం. అయినప్పటికీ కారుమంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇంత ప్రమాదకరమైన రోడ్డు లో అందులోనూ వేగంగా ప్రవహించే నదీ దాటి వెళ్లడం నిజంగా ప్రమాదకరం. ఇటువంటి వీడియోలు చూసి అభినందించడం , తప్ప నిజ జీవితంలో చేయకూడదు. ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం.
https://www.facebook.com/supercarblondie/videos/2689937877971582/?t=11
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?