Tea: టీ Tea తాగితే టీలోని కెఫీన్ ఒంటికి చేరి చురుకుదనం పెంచుతుంది. కానీ పరగడపున టీ తాగటం చాలా ప్రమాదకరమని తేలింది. అంతేకాదు టీ తోపాటు మనం తీసుకునే కొన్ని పదార్థాలతో కూడా కాస్త హానికరమైనవేనట. టీ తాగేప్పుడు మనం తరచుగా నమిలే కొన్ని స్నాక్స్ తో ఈ చిక్కులు వస్తాయన్నమాట. అంతేకాదు ప్లాస్టిక్ కప్పులో టీ తాగటంతో క్యాన్సర్ వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే వేడివేడి టీ ని మనం ఎలాంటి కప్పు ల్లో తాగుతున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. బంగారం లేదా వెండి కప్పుల్లో గరం గరం చాయ్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మీకు తెలుసా.
చాలా వేడిగా చాయ్ తాగితే అలవాటున్నట్టైంతే వెంటనే దాన్ని మానుకోండి. త్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
- రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరినట్టే. బయట టీ కోట్లో టీ తాగేవారు ఇది గుర్తుంచుకోండి.
- మంచి పోషకాలున్న డ్రై ఫ్రూట్స్, కూరగాయలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ టీ తో పాటు వీటిని తీసుకుంటే మాత్రం అది విషంగా మారటం ఖాయం.
- చాలా మంది టీ తో పాటు బజ్జీలు, పకోడీలు, గారెలు వంటి చిరుతిళ్లు తింటారు. కానీ సెనగపిండితో చేసిన ఇలాంటి వంటల తో పాటు చాయ్ తాగితే మీ ఒంట్లో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు కడుపు నొప్పి, విరోచనాలు వంటి స్టమక్ అప్ సెట్ లు తలెత్తుతాయి.
- గుడ్లతో చేసిన ఆహారాన్ని తింటూ టీ తాగడం అస్సలు మంచిది కాదు. ఈ కాంబినేషన్ క్రమంగా కడుపు, జీర్ణవ్యవస్థ కు కోలుకులేని వ్యాధులకు గురిచేస్తుంది.
- మొలకలు వంటి వాటిలో ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగాఉంటాయి. కానీ వీటిని టీ తో కలిపి తీసుకున్నపుడు హానికరంగా మారుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?