Heroines: సినీ కెరీర్ కోసం పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నా యంగ్ బ్యూటీస్..!

Share

Heroines: సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంటూ ఎన్నో కలలు కనే అమ్మాయిలు..ఆ అవకాశాల కోసం చాలా కష్టపడుతుంటారు. ఇక్కడ హీరోయిన్‌గా అవకాశం దక్కాలంటే చాలా లెక్కలుంటాయి. కొత్తగా వచ్చే వారికి డైరెక్ట్ ఎంట్రీ ఉండే అవకాశాలు చాలా తక్కువ శాతమే. ముందు మోడల్‌గా ఫిల్మ్ మేకర్స్ దృష్ఠిలో పడి ఆకట్టుకోవాలి.
ఆ తర్వాత ఫస్ట్ మూవీ ఛాన్స్ కోసం ఆడిషన్స్ ఇవ్వాలి. అయినా అవకాశం దక్కుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఎలా ఉంటుందంటే అసలు ఇండస్ట్రీ గురించి తెలియని అనుష్క శెట్టి లాంటి వారికి పూరి జగన్నాధ్, నాగార్జున లాంటి వారి ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కుతుంది.

ఎలాగైనా మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనుకునే విద్యాబాలన్ లాంటి వారి ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా త్వరగా అవకాశాలు రాక, వచ్చినా సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోవడమో..లేక ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలి మళ్ళీ అవకాశాలు రాక ఏళ్ళకి తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాల తర్వాత పెళ్ళి చేసుకోవాలని డిసైడవుతారు. కెరీర్ అంతంత మాత్రంగా సాగుతుందని ఇలా డిసైడయిన వారికి అనూహ్యంగా అవకాశాలు రావడంతో పెళ్ళికి ముందు జరిగిన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకొని సినిమాల మీద దృష్ఠి పెడుతున్నారు.

Heroines: రష్మిక పెళ్ళి రద్దు చేసుకొని సినిమా కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది.

ఇలాంటి వారిలో రష్మిక మందన్న, మెహ్రీన్ ఉన్నారు. రష్మిక మందన్న ముందు కన్నడ సినిమా కిరాక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె పెళ్ళి చేసుకునేందుకు సిద్దమయి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే అనూహ్యంగా రష్మిక మందన్నకు తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాలో అవకాశం దక్కింది. దాంతో టాలీవుడ్‌లో ఇది తనకి గ్రాండ్ ఎంట్రీ అని భావించిన రష్మిక పెళ్ళి రద్దు చేసుకొని సినిమా కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది.

రష్మిక అదృష్ఠం కొద్దీ టాలీవుడ్‌లో మంచి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కాయి. నాని, విజయ్ దేవరకొండ, నితిన్, మహేశ్ బాబుల సరసన నటించి హిట్స్ అందుకొని టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమాతో పాటు యంగ్ హీరో శర్వానంద్ సరసన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తోంది. ఆ మధ్య కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కార్తి సరసన సుల్తాన్ సినిమా చేసి అక్కడ కూడా క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు రష్మిక బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

Heroines: చాలామంది హీరోయిన్స్ బ్రేకప్ తర్వాత పూర్తిగా సినిమాల మీదే దృష్ఠి సారిస్తున్నారు.

ఇదే క్రమంలో మెహ్రీన్ కౌర్ కూడా ఇటీవల జరిగిన నిశ్చితార్థం అనివార్య కారణాల వల్ల రద్దైంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న ఆమె పెళ్ళి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఎంగేజ్‌మెంట్ రద్దవడంతో ఇకపై పూర్తిగా సినీ కెరీర్ మీదే ఫోకస్ పెట్టాలని డిసైడయింది. ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ ఎఫ్ 3లో నటిస్తున్న మెహ్రీన్, యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన మంచి రోజులొచ్చాయి సినిమాను పూర్తి చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇలా చాలామంది హీరోయిన్స్ బ్రేకప్ తర్వాత పూర్తిగా సినిమాల మీదే దృష్ఠి సారిస్తున్నారు.


Share

Related posts

జగన్ ను చూసి భయపడుతున్న రైతన్నలు..! ప్రభుత్వానికి కొత్త చిక్కులు..?

arun kanna

వర్మ తర్వాత సినిమా ఏంటో చూడండి…! ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశాడు..!

sekhar

‘మీ బట్టలు మీరే ఉతుక్కున్నారా?’

sarath