NTR : ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా వరకూ యంగ్ హీరోలతో స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ వస్తున్నారు.

ఈ విధంగానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో వెంకటేష్, రానా తో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ ఉండగా తాజాగా ఇదే తరహాలో ఎన్టీఆర్ కూడా ఓ యంగ్ కుర్ర హీరో సినిమా చేయబోతున్నట్లు టాక్. అయితే ఫుల్ లెంత్ సినిమా కాకుండా తన సినిమాలో చిన్నపాటి రోల్.. హీరో ఫ్రెండ్ పాత్ర కోసం సదరు హీరోని తీసుకోవడానికి ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ఎన్టీఆర్ కెరీర్లో 30 సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. “అయినను పోయిరావలే” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించే ఓ కీలక క్యారెక్టర్ అనగా ఫ్రెండ్ క్యారెక్టర్ లో యువ హీరో నవీన్ పోలిసెట్టి ని తీసుకోవటానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమాలో ఎన్టీఆర్ ఫ్రెండ్ పాత్రలో సునీల్ నటించడం జరిగింది. అయితే ఈ సినిమాలో సునీల్ ని నెగటివ్ షేడ్ లో చూపించడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ నేపథ్యంలో అదే విధంగా ఆధ్యాత్మిక టచ్ తరహాలో సినిమా ఉండబోతున్నట్లు సరికొత్త టాక్ వస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే బోతున్నట్లు సమాచారం.