NewsOrbit
జాతీయం న్యూస్

Sonu Sood: ‘కరోనా దేవుడి’ని కలుసుకోవటానికి కాలినడకన బొంబాయికి !హైద్రాబాద్ యువకుని పాదయాత్ర!!

Sonu Sood: వెంకటేశునికి మొక్కుకొని తిరుమల కొండలకు నడిచి వెళ్లేవారిని చూస్తుంటాం.పాదయాత్రలు చేసే రాజకీయ నాయకులు కూడా మనకు తెలుసు.కానీ కరోనా సమయంలో విశేష సేవలందిస్తున్న తన అభిమాన నాయకుడిని కలుసుకోవడం కోసం ఒక యువకుడు ఏడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లడం అరుదైన విషయమే.

Youngster walked from hyderabad to mumbai to meet sonu sood
Youngster walked from hyderabad to mumbai to meet sonu sood

ఇది ఎక్కడో జరగలేదు.మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణా రాజధాని హైదరాబాదులోని ఈ విశేషంచోటుచేసుకుంది.హైద్రాబాద్ నుండి వెంకటేష్ అనే యువకుడు ఏడు వందల కిలోమీటర్లు నడిచి ముంబాయికి వెళ్లి తన అభిమాన నేతను కలుసుకున్నాడు.ఇంతకీ ఆ నేత ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. అతనేమీ రాజకీయనాయకుడు కాదు. సీఎం కాదు .పీఎం కాదు.కరోనా వేళ ప్రజలకు ఆపద్బాంధవునిగా మారిన సినీ నటుడు సోనూసూద్ ను కలవడం కోసం ఆ యువకుడు ఇంత రిస్క్ తీసుకున్నాడు.

Sonu Sood: అనితర సాధ్యమైన రీతిలో సోనూసూద్ సేవలు!

కరోనా భారతదేశాన్ని కమ్మేసిన వేళ సోనూసూద్ నేనున్నానంటూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మొదటి వేవ్ లో వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు పంపడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే.విమానాలతో సహా ఏ వాహనం వీలైతే ఆ వాహనాన్ని వలస కార్మికుల కోసం సోనూసూద్ ఏర్పాటు చేయడం విదితమే.ఇక కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ఆయన ఆక్సిజన్ కొరతను గమనించి ఎక్కడ అవసరమైతే అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సోనూసూద్ ను స్ఫూర్తిగా తీసుకొని మన మెగాస్టార్ చిరంజీవి కూడా జిల్లాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయటం ఇక్కడ గమనార్హం.కరోనా బాధితులకు సోనూసూద్ చేస్తున్న సేవలు అనితర సాధ్యమైనవిగా అందరి ప్రశంసలు పొందుతున్నాయి.ఇవన్నీ గమనించిన వెంకటేష్ ఆయన వీరాభిమాని గా మారాడు.సోనూ సూద్ ను కలుసుకోవడం కోసం బొంబాయికి ఆయన హైదరాబాదు నుండి ఏడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు.

ఆనందకరమే కానీ అలా చేయవద్దు!

కాగా వెంకటేష్ ను సోనూసూద్ సాదరంగా రిసీవ్ చేసుకున్నారు.మంచి ఆతిథ్యం ఇచ్చారు.ఇది నిజంగా తనకు ఆనందం కలిగించిందని సోనూసూద్ ట్వీట్ చేశారు.తాను రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నా వేంకటేష్ వద్దన్నాడని ఆయన తెలిపారు.అతని పట్టుదల తనకు ప్రేరణ ఇచ్చిందని కూడా సోనూసూద్ పేర్కొన్నాడు.కానీ నా అభిమానులెవరూ ఇలాంటి పనులు చేయవద్దు..వీలైనంతగా ప్రజా సేవ చేయండి అంటూ సోనూసూద్ ఆ ట్వీట్లో కోరాడు.

 

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju