న్యూస్

యుట్యూబర్ వెధవ్వేషానికి శిక్ష!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

బిస్కెట్ల మధ్య టూత్‌పేస్ట్ పెట్టి ఓ నిరాశ్రయుడితో తినిపించిన స్పానిష్ యుట్యూబ్ స్టార్‌కు 15 నెలల జైలుశిక్ష పడింది. ఆ అభాగ్యుడికి 22,300 డాలర్లు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. అయితే రెన్ జైలుకు వెళ్లాల్సిరాకపోవచ్చు. హింసాత్మక నేరాలు కాని నేరాలలో మొదటిసారి కోర్టుకు వచ్చిన నిందితుడికి రెండేళ్ల లోపు శిక్షను  సాధారణంగా స్పెయిన్ కోర్టులు సస్పెండ్ చేస్తాయి.

యూట్యూబ్‌లో రీసెట్ అనే ఛానల్ నడిపే కన్హువా రెన్ అనే యువకుడు తన ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోల కోసం రకరకాల పరిహాసాలు, నాటకాలు, చేష్టలు చేస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే వెధవ వేషాలు వేస్తాడు. అలాంటి ఆటల్లో భాగంగా ఒకరోజు దారిపక్కనున్న ఓ యాచకుడికి బిస్కెట్ పాకెట్, దానితో పాటు కాస్త డబ్బు ఇచ్చాడు. ఇందులో వెధవ వేషం ఏమిటంటే బిస్కెట్ల మధ్య క్రీమ్ బదులు టూత్‌పేస్ట్ పెట్టాడు.

ఆ బిస్కెట్లు తిని వాంతి చేసుకున్న ఆ అభాగ్యుడు, తనను ఇంత అన్యాయంగా ఎవరూ పరిహసించలేదని వాపోయాడు. అతని నైతిక నిష్టను దెబ్బతీశాడంటూ రెన్‌పై కేసు పెట్టారు. తాను చేసింది బ్యాడ్ జోక్ తప్ప మరేమీ కాదని రెన్ కోర్టులో వాదించాడు. మరి ఆ వీడియోపై సంపాదించిన రెండు వేల యూరోల సంగతేమిటని న్యాయమూర్తి ప్రశ్నించాడు.


Share

Related posts

 Vijay devarakonda : విజయ్ దేవరకొండతో నేను రెడి … రష్మిక మందన్న

GRK

జయలలిత స్మృతులని మిస్ అవుతున్న వాళ్ళ కోసం … ! 

sekhar

లాక్ డౌన్ కంటే అన్ లాక్ లోనే జాగ్రత్తగా ఉండాలి.. మన్ కీ బాత్ లో ప్రధాని

Muraliak

Leave a Comment