ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్

కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.