Ys Jagan: ఏపీ సీఎం జగన్ భార్య వైయస్ భారతి పై పొగడ్తలు వర్షం..!!

Share

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిమ్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వివాహం అయ్యి 25 సంవత్సరాలు కావడంతో భార్య భారతితో కలిసి.. జగన్ సిమ్లా పర్యటన చేపట్టారు. వైయస్ జగన్ ..భారతీ మ్యారేజ్ డే సందర్భంగా.. వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకులతో పాటు ప్రముఖులు అదేరీతిలో వైసిపి పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు.. ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. వైయస్ జగన్ కి అదే రీతిలో భారతీ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భగవంతుని ఆశీస్సులు ఉండాలని, నిండు ఆయురారోగ్యాలతో.. అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవితం గడపాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

CM Jagan-Bharathi Wedding Anniversary : సిమ్లాలో వేడుక జరుపుకోనున్న సీఎం  దంపతులు... | cm ys jagan's 25th wedding anniversary today celebrating in  shimla with his family - Telugu Oneindia

రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఇంకా చాలామంది 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆగస్టు 28 1996లో వైయస్ జగన్ భారతి ల వివాహం జరిగింది. ఈ క్రమంలో 25 సంవత్సరాల ప్రయాణంలో.. దాదాపు 10 సంవత్సరాల పాటు జగన్ రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కోవటం జరిగింది. 2009 నుండి 2019 వరకు.. ఎంతో స్ట్రగుల్ ఎదుర్కొన్న జగన్ కి వెన్నంటే భారతి ఉండటం చాలా గ్రేట్ అంటూ.. 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో చాలామంది పొగుడుతున్నారు.

 

ఒకపక్క భర్త అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఇద్దరు పిల్లలను.. చదువుల విషయంలో వైఎస్ భారతి అనేక శిఖరాలు అధిరోహించెలా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం మాములు విషయం కాదని పేర్కొన్నారు.  నిజంగా వైయస్ జగన్ విజయం వెనకాల వైయస్ భారతి.. ఓర్పు.. పోరాటం చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. ఏదిఏమైనా వైయస్ జగన్ భారతి ల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో పాటు అభిమానులు ఇంకా చాలా మంది ప్రముఖులు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : దెబ్బకు అభిజిత్ హీరో అయ్యాడు… అఖిల్ ఢీలా పడ్డాడు

arun kanna

జనసేన 6వ జాబితా విడుదల

somaraju sharma

ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది డిల్లీబాబు ఆత్మహత్య

somaraju sharma