NewsOrbit
న్యూస్

వైఎస్ఆర్ ప్రాణ స్నేహితులతో జగన్ కి బిగ్ ఫైట్?

జగన్ కష్టాల్లో ఉన్నప్ప్పుడు ఆయనకు తోడుగా నిలవడంలో విఫలమయ్యింది సమర్ధవంతమైన ఆయన వర్గం.. అని కామెంట్లు వినిపించాయి. కానీ… వైఎస్ వర్గంగా చలామణి అయినవారిలో కేవీపీ వర్గమే ఎక్కువని, వారు కేవీపీ వర్గంగా ఉంటూనే.. వైఎస్ సన్నిహితులుగా మెలిగేవారని అంటున్నారు! అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది.. వైఎస్ – కేవీపీ వేరు వేరు కాదు కదా! అన్న క్లారిటీ ఉన్నా… ప్రస్తుతం కేవీపీ రహస్య వర్గం అనబడేవారు, కెవీపీతో బంధాలు కలుపుకున్నవారు వరుసపెట్టి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు! దీనికి కారణం… బీజేపీ – టీడీపీ వర్గానికి కేవీపీ ఇప్పుడు కీలక దిక్కుగా మారారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతకొన్ని రోజులుగా కేవీపీ వర్గమైన ఉండవల్లి అరుణ్ కుమార్, రఘురామకృష్ణం రాజు, సబ్బం హరి, శైలజానాథ్, ధర్మానప్రసాద్ రావు మొదలైన వారు జగన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించడమే దీనికి కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న నేతల్లో కేవీపీ వర్గం బాగానే ఉంటుందని, ఆ వర్గాన్ని కాస్త బీజేపీ వైపు లాగగలిగితే.. జగన్ కు దెబ్బపడుతుందని భావిస్తున్నారంట. ఇలాంటి ఊహాగాణాలు ఏపీ కేంద్రంగా గతకొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. పైగా రఘురామకృష్ణం రాజు వ్యవహారం వెనక కూడా.. ఆయన వియ్యంకుడు కేవీపీ ఇచ్చిన మద్దతే కారణం అని అంటున్నారు!!

దీనంతటికీ కారణం… జగన్ పనుల వల్ల ఒక సామాజికవర్గం ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతింటుందనే కక్షే కారణం అని తెలుస్తోంది. ఈ లాజిక్కుల్లో కేవీపీ కీలకంగా మారగా, ఆయనకు పూర్తిగా బీజేపీ, టీడీపీలు మద్దతు ఇస్తున్నాయని.. జగన్ ఏ విషయంలో వెనక్కి తగ్గకపోవడం, జగన్ దగ్గర బేరాలు లేకపోవడంతో వ్యవహారం కేవీపీ కోటరీ అనే వరకూ వచ్చిందని అంటున్నారు!! ఈ గాసిప్స్ సంగతి అలా ఉంచితే… జనంలో జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి.. ఈ అధికార దాహంతో చేసే ఎత్తులకు, పైఎత్తులకు జగన్ భయపడాల్సిన అవసరం లేదని, రాజకీయాలపట్ల జగన్, జనం అప్పట్లా కాకుండా చాలా ఆలోచనతో ఉన్నారని మరికొందరు అంటున్నారు!! ఏది ఏమైనా… ఏపీ రాజకీయాల్లోకి కేవీపీ ఎంట్రీ, కేవీపీ వర్గం వంటి మాటలు సంచలనంగా మారాయనే చెప్పాలి!

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju