NewsOrbit
న్యూస్

జగన్ చక్ర వ్యూహం అమలు..900 కోట్ల భారీ స్కాం పట్టుకున్నాడు!

వైసిపి సర్కార్ తన పంధా మార్చింది తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటంతో పాటు ఆ పార్టీకి మద్దతిచ్చే ప్రతిపక్షాలను కూడా విడగొట్టే విధంగా వ్యూహం పన్నింది.దీంతో ఏడాది కాలంగా రాజ్యాంగ వ్యవస్థలు సహా ప్రతిపక్షాలన్నిటితోనూ వైసీపీ సాగిస్తున్న పోరాటం కొత్త మలుపు తిరిగింది. అప్రతిహతమైన మెజార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనేక రకాల ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. రాజ్యాంగ వ్యవస్థలతో పోరాటం తోసమయాన్ని వృథా చేసింది. ఆ పొరపాట్ల నుంచి క్రమేపీ పాఠాలు నేర్చుకుంటూ ప్రస్తుతం నేరుగా ప్రధాన ప్రతిపక్షంపై గురి పెట్టింది. అందులోనూ మిగిలిన రాజకీయ పక్షాలను , తెలుగుదేశాన్నివేరు చేస్తూ పకడ్బందీగా దాడులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకూ ప్రజాసమస్యలపై ఆందోళనల పేరిట తెలుగుదేశం వైఖరిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇతర పార్టీలన్నీ సమర్థిస్తూ వచ్చాయి. తాజాగా జగన్ ప్రభుత్వం ఆ పరిస్థితికి తావివ్వకుండా తెలుగుదేశం పై అవినీతి అస్త్రాలను ప్రయోగిస్తోంది



నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం సవాళ్లు విసురుతూనే ఉంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి తమపై విచారణలు జరిపి అవినీతిని బయటపెట్టుకోవచ్చుననేది టీడీపీ సవాళ్ల సారాంశం. తొలి దశలో దీనిపై పెద్దగా దృష్టి పెట్టని వైసీపీ ఇతర అంశాలపై సమయాన్ని వృథా చేసింది. పోలవరం, రాజధాని, ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో వివాదం, పార్టీ రంగులపై న్యాయపోరాటం వంటి అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చించింది. ఇవన్నీ దాదాపు ప్రభుత్వానికి ప్రతికూలంగానే పరిణమించాయి. పైపెచ్చు ప్రతిపక్షాలు ఆధిక్యం సాధించడానికి, ఏకతాటిపైకి రావడానికి దోహదం చేశాయి. దీంతో ముందుగా తాను ప్రధాన ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నాలు చేయాలనే విషయంలో వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఫలితంగానే తాజాగా టీడీపీ నేతలపై వరస దాడులు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక పథకాలలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలున్నాయి. వాటిపై వైసీపీ దృష్టి పెట్టింది. టీడీపీ అధినేతకు అండగా ఉండేవారిపై పెడుతున్న కేసులు ఆ పార్టీ శ్రేణులను బెంబేలెత్తిస్తున్నాయి

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది అవినీతి నిరోధక శాఖ. చంద్రబాబు తన పదవీకాలం చివరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీబీఐ రాష్ట్రంలో కేసుల దర్యాప్తు జరపకుండా నిషేధం విధించారు. ఇందుకు రాజకీయ కారణాలు, అవసరాలు తోడ్పడ్డాయి. అదే సందర్భంలో కేసుల దర్యాప్తునకు సంబంధించి కొన్ని ప్రత్యేక అధికారాలను ఏసీబీకి కట్టబెట్టారు. ప్రస్తుతం వైసీపీ సర్కారు వాటిని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. కొంతమేరకు ఆధారాలు ఉండి పట్టుబిగించే అవకాశం ఉన్నచోట్ల ఏసీబీని ప్రయోగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తొమ్మిదివందల కోట్ల రూపాయల మేరకు సాగిన మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లు, టెలి వైద్య సేవల స్కాంలో టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగలిగింది. ఈఎస్ఐ కు సంబంధించిన ఈ స్కాంలో నిజానికి కేంద్రనిధులే అధికం. అయినప్పటికీ సీబీఐకు కేసును అప్పగించకుండా రాష్ట్రప్రభుత్వమే ఏసీబీ ద్వారా విచారణ జరపాలనుకోవడంలోనే రాజకీయం దాగి ఉంది. కేసును వేగవంతం చేయడం, అవసరాలకు అనుగుణంగా అవినీతి నిరోధక సెక్షన్లను వినియోగించే వెసులుబాటును వినియోగించుకోవడమే ఉద్దేశం. అదే సీబీఐ అయితే ఏళ్లుపూళ్లు పట్టే అవకాశం ఉంది

వైసీపీ సర్కారుది ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో పాటు లోతైన అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది. విచారణల్లో సీబీఐ తీరు వేరు. కోడిగుడ్డుపైన సైతం వెంట్రుకలు తీయగల సామర్థ్యం దాని స్పెషాలిటీ. అందుకే క్లిష్టంగా ఉంటుందనిపించే అంశాల్లోనూ, రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగే విషయాల్లోనూ సీబీఐ దర్యాప్తును కోరాలని భావిస్తోంది. చంద్రన్న కానుకలు, హెరిటేజ్ కొనుగోళ్లపై దర్యాప్తునకు సీబీఐ ను ఆశ్రయించాలని మంత్రిమండలి తీర్మానించడంలోని ఉద్దేశమిదే. అయితే వైసీపీ అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల రూపాయల అవినీతి పేరిట ఆరోపణలు చేసిన రాజధాని, పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల వంటి వాటిని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

పక్కాగా పొలిటికల్ అజెండాతో వైసీపీ పావులు కదుపుతూ ఉండటంతో టీడీపీకి అండగా నిలిచేవారు కరవు అయిపోతున్నారు. ఈ ఎస్ ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడాన్ని విపక్షాలేవీ వ్యతిరేకించలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఉపయోగించిన బీసీ కార్డును తీవ్రంగా ఆక్షేపించాయి. టీడీపీ నుంచి తమను తాము దూరం చేసుకునే ఒక అవకాశంగా దీనిని విపక్షాలు భావించాయి. ఈమేరకు వైసీపీ సర్కార్ విజయం సాధించనట్లే చెప్పాలి. ముఖ్యంగా బీజేపీ , జనసేన, వామపక్షాలు గత ప్రభుత్వంలో అవినీతి పరులను శిక్షించాలనే నినాదాన్ని ఎత్తుకున్నాయి.ఏడాది కాలంలోనే జగన్ రాజకీయ ఎత్తుగడలను ఆకళింపు చేసుకుని వాటిని అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు.

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju