YS Jagan : ఏపీకి బీజేపీ చిప్ప చేతికిచ్చింది. ఏపీకి బీజేపీ Central Budget లో అన్యాయం చేసింది. పోతే బీజేపీ పోతుంది. లేదా జనసేన పోతుంది. కానీ జగన్ కి ఎందుకు నష్టం..!? అనే అనుమానాలు రావచ్చు..! నిజమే. నూటికి నూరుశాతం bjp బీజేపీ చేసే ప్రతీ తప్పుకి బలయ్యేది YS Jagan జగన్ మాత్రమే..! ఎందుకనేది కొంచెం లోతుగా వెళ్లి తెలుసుకోవాల్సిందే..!!

YS Jagan : బీజేపీ కి ఏముంది పోవడానికి..!?
ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తే బీజేపీనే పోతుంది అని సింపుల్ గా అనుకోవచ్చు. కానీ ఇక్కడ బీజేపీకి ఏమి లేదు. ప్రత్యేకంగా పోవడానికి ఏపీలో బీజేపీకి ఏమి లేదు. రాష్ట్రం మొత్తం మీద కనీసం 5 శాతం ఓట్లు లేవు. ఒక్క శాసనసభ నియోజకవర్గంలోనూ కనీసం 10 శాతం ఓట్లు లేవు. ఒక్క జిల్లాలోనూ కార్యకర్తల బలం లేదు. బీజేపీకి ఏపీలో కేవలం నాయకులూ మాత్రమే ఉన్నారు. వారు కూడా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఉంటారు.., ఆ తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఉన్న కొద్దిపాటి కార్యకర్తలు కూడా గుడ్డిగా నమ్మేవారే తప్ప.., పరికి నాలుగు ఓట్లు వేయించే వారు కాదు.. ! సో.., బీజేపీకి ఏపీలో ఓట్లు లేవు, సీట్లు లేవు, కార్యకర్తలు లేరు. అందుకే ఈ రాష్ట్రానికి బీజేపీ ఎంతగా అన్యాయం చేసినా ఆ పార్టీకి పెద్దగా వచ్చే నష్టం అంటూ ఏమి లేదు. సో.., వాళ్ళు ఏపీతో ఏమైనా చేసుకోవచ్చు. ఎలా అయినా ఆడుకోవచ్చు..!

జనసేన అదే పరిస్థితి..!
బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తే బీజేపీ తర్వాత వాళ్ళ మిత్రుడు పవన్ కళ్యాణ్ నష్టపోవాలి. బీజేపీ తర్వాత ఆ ప్రభావం జనసేనపై ఉంటుంది. ఇది కూడా సేమ్ పరిస్థితి. జనసేన కి కూడా ఏపీలో తాడూ బొంగరం లేవు. ప్రత్యేకంగా పోవడానికి ఏమి లేవు. జగసేనకి ఏపీలో ప్రస్తుతం అక్కడక్కడా కార్యకర్తల బలం ఉంది. పవన్ కళ్యాణ్ కి అభిమాన బలం ఉంది. ఈ వర్గాలు బీజేపీ అన్యాయం చేసినా.. న్యాయం చేసినా.. రాష్ట్రం ఏమైపోయినా పవన్ భజన తప్ప మరోటి చేయలేరు. సో.., ఈ బలం పవన్ కి పెరగదు, తగ్గదు. రాష్ట్రంలో ఉన్న 5 శాతం ఓటింగ్ నిలబెట్టుకోవాలన్నా.., దాన్ని 10 లేదా 15 శాతానికి పెంచుకోవాలన్నా పవన్ రాజకీయ అడుగులు మారాలి. ఆ అవకాశం లేదు, పవన్ కి పరిపక్వత లేదు కాబట్టి… జనసేన కూడా ప్రత్యేకంగా పోగొట్టుకునేది ఏమి ఉండదు..!!

జగన్ కి మాత్రం అతి పెద్ద నష్టం తప్పదు..!!
బీజేపీకి జనసేన పైకి కనిపిస్తున్న మిత్రుడు. కానీ బీజేపీకి జగన్ లోపలి మిత్రుడు. బీజేపీ అడగకుండానే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ.. బీజేపీ అడగకుండానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీకి మద్దతిచ్చింది వైసీపీ. అనవసరంగా.., అసందర్భంగా అవకాశం చూసుకుని మరీ మోడీ భజన చేస్తున్నది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నెలకోసారి ఢిల్లీ వెళ్లి.. కేంద్ర పెద్దలను కలిసి వస్తున్నది వైసీపీ అధినేత జగన్..! సో.., బీజేపీకి – జగన్ కి ఉన్న సంబంధం బయటకు తెలియనిది కాదు. కాస్త ఆలోచించిన ప్రతీ ఒక్కరికీ జగన్ బీజేపీకి దగ్గరగా ఉంటున్నారని విషయం అర్ధమవుతుంది..! సో.., బీజేపీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిస్తే ఆ నొప్పి భరించాల్సింది జగనే. బీజేపీ రాష్ట్రానికి చిప్ప ఇస్తుంటే.. దాన్ని అందుకుని ఫలితం అనుభవించాల్సింది జగనే..!
* జగన్ పరిస్థితి బీజేపీ, జనసేనలా కాదు. క్షేత్రస్థాయిలో వైసీపీ బలంగా ఉంది. బీజేపీ వేసే ప్రతీ అడుగు జగన్ పై ప్రభావం చూపిస్తుంది. జగన్ ఒక్కసారి కూడా అటు కేంద్రాన్ని కానీ.., మోడీని కానీ విమర్శించలేదు. కనీసం కేంద్ర బడ్జెట్ పై కూడా ఏమి మాట్లాడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది కూడా రాష్ట్రానికి Central Budget. కేంద్ర బడ్జెట్ లో ఏమి దక్కకపోవడంతో ఒత్తిడి మొత్తం ఇప్పుడు జగన్ పైకి మళ్లింది. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది.., రాజకీయ నష్టాన్ని భరించాల్సింది.., లేదా బీజేపీపై తిరగబడాల్సింది జగనే..!!