NewsOrbit
న్యూస్

కనీస ధర్మం పాటించని జగన్ ! గుర్రుగా ఉన్న వైసీపీ నేతలు??

వైసీపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునే సమయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరి మీద రుసరుసలు వినిపిస్తున్నాయి.

ys jagan do not follow the minimum virtue YCP leaders who are angry
ys jagan do not follow the minimum virtue YCP leaders who are angry

అయితే జగన్ ని బహిరంగంగా ఏమనలేక లోలోనే వైసీపీ నేతలు కుమిలిపోతున్నారు.ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. వారంతా పార్టీ కండువా కప్పుకోకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి విడాకులు తీసుకున్న వారే. అనధికారికంగా జగన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న వారే. అయితే ఇప్పుడు పార్టీలో జగన్ చేర్చుకుంటున్నందుకు కాదు. తమకు కనీస సమాచారం కూడా జగన్ ఇవ్వకపోవడంపై వైసిపి నేతలు గుర్రుగా ఉంటున్నారు.జగన్ తొలి నుంచి అంతే. ఎవరినైనా పార్టీలోకి తీసుకోవాలంటే అప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్న వారికి తెలియపర్చాలి. ఇది కనీసం ధర్మం. వారు అభ్యంతరం చెప్పే అవకాశమే లేదు.

ఎందుకంటే జగన్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వెనుకాడరన్న సంగతి తెలిసిందే. కానీ కనీసం కర్టెసీ గా కూడా వారికి చెప్పకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీని ఏళ్లుగా నమ్ముకున్న తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడమేంటన్న అసంతృప్తి వైసీపీ నేతల్లో ఉంది.గన్నవరం నియోజకవర్గం టిడిపి శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాడేపల్లిలోని జగన్ కార్యాలయం చేరుకునే వరకూ ఎవరికీ తెలియదు. అక్కడ ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు కూడా సమాచారం అందించకుండానే వల్లభనేని వంశీని పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ గొడవ మామూలుగా లేదు. ఇక మద్దాలి గిరి విషయంలోనూ అంతే. గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో ఇప్పుడు నేతల మధ్య సఖ్యత లేదు.వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు డీసీఎంఎస్ ఛైర్మన్ ఇచ్చినా, గిరి ఓడించిన ఏసురత్నంకు మిర్చి యార్డు ఛైైర్మన్ పదవి ఇచ్చినా ఫలితం లేదు.

ys jagan do not follow the minimum virtue YCP leaders who are angry
ys jagan do not follow the minimum virtue YCP leaders who are angry

చీరాల్లో టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ ని పార్టీలో కి తీసుకున్నప్పుడు కూడా జగన్ ఇదే వైఖరి అనుసరించారు.నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ప్రమేయం లేకుండానే బలరామ్ పార్టీలో చేరిపోయారు.ఇప్పుడు బలరామ్ ఆమంచి మధ్య ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది ఈ మధ్యే బలరామ్ కుమారుడు కరణం వెంకటేష్ బహిరంగ సభలో ఆమంచి మీద అవాకులు చవాకులు పేలటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.పైగా ఇతర నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నప్పుడు జగన్ తన సొంత పార్టీ ఇంచార్జీలకు ఏదో ఒక పదవిచ్చారు.చీరాల్లో అలా కూడా జగన్ చేయలేదు.తాజాగా విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి లోకి వచ్చారు.ఈ సందర్భంలో కూడా గణేష్ చేతిలో ఓడిపోయిన వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్కు కనీస సమాచారం లేదు.

అయితే ద్రోణంరాజుకు ముందే కేబినెట్ ర్యాంకు పదవిని జగన్ ఇచ్చారు.అది గుడ్డిలో మెల్ల లాగుంది. ఇలా చేర్చుకుంటే చేర్చుకున్నారు కానీ తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో వైసీపీ నేతల్లో జగన్ తీరుపట్ల అసంతృప్తి కలుగుతోంది.జగన్ ఒంటెద్దు పోకడలు పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయని వైసిపి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.అయితే జగన్ నైజం తెలిసిన వారు కాబట్టి ఎవరూ ఆయనకు ఇప్పుడు ఎదురు చెప్పలేకపోతున్నా భవిష్యత్తులో వారు ఎదురు తిరిగే అవకాశం లేకపోలేదు .

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!