NewsOrbit
న్యూస్

‘సమస్య.. సొల్యూషన్’ దిశగా వైఎస్ జగన్ ఒకే ఒక్కడిని దింపాడు!

వైసీపీలో పొడచూపుతున్న అసమ్మతి , అంతర్గత విబేధాల మీద పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు .ప్రత్యేకించి అన్నిటికంటే పెద్ద తలనొప్పిగా మారిన నెల్లూరు జిల్లా విషయాన్ని ఆయన మొదటగా టేకప్ చేశారు.

YS Jagan dropped the only one towards 'problem .. solution'
YS Jagan dropped the only one towards ‘problem .. solution’

నెల్లూరు జిల్లా వైసీపీ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ,ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గీయులు కత్తులు నూరుతున్నారు.విధేయతను, అనిల్ కుమార్ యాదవ్ గత ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆయనకు నెల్లూరు జిల్లా నుండి మంత్రి పదవి ఇచ్చారు.కానీ వైసిపి ఎన్ఐటిల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు.కొందరు నాలుగు సార్లు, మరికొందరు రెండు సార్లు.. అంతకు మించి గెలిచి ఉన్నారు.అన్నిటికీ మించి నెల్లూరు జిల్లా అంటే రెడ్ల కంచుకోట.అలాంటి నెల్లూరు జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలను పక్కన బెట్టి బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వడం వారికి రుచించలేదు.

పైగా అనిల్ కుమార్ కూడా ఒంటెద్దు పోకడలు పోతున్నారట.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బహిరంగంగానే అనిల్ కుమార్ ని దులిపేశారు. ఆయనే కాదు…ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి తదితరులకు కూడా మంత్రితో పొసగడం లేదు మంత్రి గా అనిల్ ఉన్నా ఆయ‌న ఏ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టే ప‌రిస్థితి లేదు. దీంతో ఇక్క‌డ జ‌గ‌న్ నేత‌లు స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లాల‌ని ఎన్నిసార్లు చెప్పినా విన‌డం లేదు.అంద‌రూ సీనియ‌ర్ నేత‌లే కావ‌డంతో క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం.. విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇది పార్టీకి న‌ష్టం క‌లిగిస్తుంద‌న్న నివేదిక‌లు జ‌గ‌న్‌కు వెళ్ల‌డంతో జ‌గ‌న్ చివ‌ర‌కు నెల్లూరు జిల్లాలో నేతల పంచాయితీని స‌రిచేసే బాధ్య‌త‌ను అదే జిల్లాకు చెందిన మరో మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డికి అప్ప‌గించారు. గౌతంరెడ్డికి ఏ ఒక్క‌రితోనూ గ్యాప్ లేదు. త‌న ప‌ని తాను చేసుకుపోతుంటారు. ఆయ‌న్ను అంద‌రూ అభిమానిస్తారు. గ్రూపు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డం ఆయ‌న నైజం. గౌతంరెడ్డి జిల్లాలోని అంద‌రూ ఎమ్మెల్యేల‌తో మాట్లాడి వీరిని ఓ రోజు కూర్చోపెట్టి వారి స‌మ‌స్య‌లు విన‌నున్నారు. మేకపాటి సయోధ్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి!

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!