YS Jagan: అప్పుడు రద్దు అన్న శాసనమండలే ఇప్పుడు జగన్ కు ముద్దు!!మరి సీఎం అవసరాలు అలాంటివి!!

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది.గత ఏడాది జనవరిలో శాసనమండలి రద్దు కు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రద్దు తీర్మానం గురించి మర్చిపోయి శాసనమండలి లో వైసీపీ బలాన్ని పెంచుకునే కార్యక్రమంలో పడ్డారు.ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

YS Jagan Express Dual tone on Legislative Council
YS Jagan Express Dual tone on Legislative Council

YS Jagan: జగన్ కు ఎందుకు కోపం వచ్చిందంటే?

శాసనసభలో తిరుగులేని మెజార్టీ కలిగిన వైసిపి శాసన మండలిలో మాత్రం బలం లేదు.టీడీపీ అక్కడ మెజారిటీతో చక్రం తిప్పుతోంది.పైగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ నేత కావడంతో వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదు.ముఖ్యంగా జగన్ మానస పుత్రిక అయిన మూడు రాజధానుల బిల్లును శాసనమండలి తిరస్కరించటం సీఎం కి చాలా ఆగ్రహం తెప్పించింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేనట్టు జగన్ అప్పటికప్పుడు అసెంబ్లీలో శాసనమండలి రద్దుకు తీర్మానం చేయించేశారు.దాన్ని కేంద్రానికి కూడా పంపించారు.అంతటితో రాష్ట్రం పాత్ర ముగిసింది.కేంద్రం ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.అది జరిగే వరకు శాసనమండలి సజీవంగానే ఉంటుంది.ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడం వంటి ప్రక్రియ సాగాల్సిందే. ప్రస్తుతం జగన్ అదే పనిలో ఉన్నప్పటికీ అప్పుడు ఎందుకంత తొందర పడ్డాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Read More: Eatela Rajendar: ఈట‌ల రెండో సీఎం… టీఆర్ఎస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

అప్పుడు ఎన్టీఆర్ దీ అదే వరస!

1983లో టీడీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ కి కూడా కాంగ్రెస్ కు మెజార్టీ ఉన్న శాసనమండలి చిరాకు తెప్పించి౦ది.మహా ఆవేశపరుడైన ఎన్టీఆర్ వెంటనే శాసనమండలి రద్దుకు నడుం బిగించారు.మండలి రద్దయ్యే వరకు ఆయన విశ్రమించలేదు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మండలిని పునరుద్ధరించుకు౦ది. అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు జగన్ కూడా ఆవేశపూరితంగానే శాసనమండలి రద్దు కు నిర్ణయం తీసుకున్నారు తప్ప అన్నీ ఆలోచించి మాత్రం కాదు.అయితే ఎన్టీఆర్ శాసనమండలి రద్దుకు కట్టుబడ్డారు.మరి జగన్ కూడా అదే విధంగా శాసనమండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా అన్నది సమాధానం దొరకని ప్రశ్న.నిజానికి జగన్ ఆ పని చేయలేరని అంటున్నారు.పార్టీలో ఉన్న చాలా మంది ఆశావహులకు ఆయన శాసన మండలిలోనే అవకాశం కల్పించాల్సి ఉండగా దాని రద్దుకు పట్టుబట్టడం ప్రసక్తే లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.అందుకే రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 


Share

Related posts

ఇక దుబారా ఉండదు

somaraju sharma

బిగ్ బాస్ 4: అరగుండు లో అమ్మ రాజశేఖర్…??

sekhar

వైరల్ వీడియో: చిన్న పొరపాటు.. ఎలా యువతి ప్రాణం తీసిందో చూడండి..!

Varun G