NewsOrbit
న్యూస్

జ్ఞానోదయం: సచిన్ తో ప్రియాంక డీల్… జగన్ భయం ఫలితమా?

రాజస్థాన్ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. క్షణక్షణం మారిపోతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లాట్ పై ఎగిసిపడ్డ తిరుగుబాటు నేతలు ఒక్కసారిగా మెత్తబడ్డారు. తమ ప్రభుత్వంపై ఒక్కసారిగా తిరగబడ్డ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్ పైలట్ కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్‌.. అధిష్టానం చొరవతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గహ్లాట్, పైలట్‌ మధ్య రాజీ కుదిర్చినట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.


అయితే పైలట్‌ పలు డిమాండ్లను పార్టీ ముందుంచారని.. పార్టీ చీఫ్‌గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని కోరికను వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా పార్టీలోని ఇరు వర్గాల మధ్య చర్చలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి. ఇదిలా నడుస్తుండగానే… ఎవరికి వారు నేతలను కాపాడుకొనేందుకు రిసార్డ్ రాజకీయం కూడా ప్రారంభమైంది. అయితే డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు తగ్గేదే లేదని సచిన్ వర్గం భీష్మించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఇదే సందర్భంలో.. ఇలాంటి సమస్యలకు తెగిందాకా లాగకూడదని.. అలా లాగే ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను దూరం చేసుకొని.. కేంద్రంలో కూడా పట్టును కోల్పోవలసి వచ్చిందని కూడా అధిష్టానం విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రియాంక గాంధీ మనిషిగా ఉన్న సచిన్ పైలట్ తో ప్రియాంక గాంధీ పలుమార్లు చర్చలు జరిపారని… అందులో భాగంగానే సచిన్.. ప్రియాంక మాటను కాదనలేక వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా.. సచిన్ పైలట్ ను వదిలిపెడితే.. పార్టీకి మేకై, వైఎస్ జగన్ లా రాజస్థాన్ లో మరో బలమైన నేతగా మారే అవకాశం ఉందని కూడా స్పష్టమౌతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో బయటకు వచ్చిన వ్యక్తులే శక్తులుగా మారి వారి వారి రాష్ట్రాలలో బలమైన రాజకీయ శక్తులుగా అధికారంలో ఉంటడం విశేషం. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.

కాగా జైపూర్‌ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. తన ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గహ్లాట్ స్పష్టం చేయడంతో నెంబర్‌ గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. అలాగే.. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆయన వివరించారు. కాగా 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. అలాగే.. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju