NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తిరుపతి ప్రజలలోకి వైఎస్ జగన్..??

Share

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరుపతి ఉప ఎన్నిక కుదిపేస్తోంది. ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో అసలు టీడీపీ ఉప ఎన్నికలలో పోటీ చేయొద్దని వార్తలు వచ్చిన తర్వాత మాత్రం పోటీకి దిగడంతో ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ముఖ్యంగా చంద్రబాబు జిల్లా కావడంతో తప్పనిసరిగా టీడీపీ పోటీ చేయాలన్న ఒత్తిడి రావడంతో టిడిపి పోటీకి రెడీ అయినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy announces Rs 50 Lakh ex gratia to kin of slain jawanఇదే క్రమంలో వైసిపి అదేవిధంగా బిజెపి పార్టీలు తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల విషయంలో వేట మొదలుపెట్టారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే వైసీపీ ప్రభుత్వం చాలా బలంగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఇతర పార్టీల కార్యకర్తల చేత కూడా శభాష్ అనిపించుకునే రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారు. తన మన అనే భేదం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో ఎంపీ స్థానం కోసం రాబోయే ఉప ఎన్నికల్లో తిరుపతి ప్రజల వద్దకు ఆల్రెడీ ఇప్పటికే ముగ్గురు ఎంపీలతో పాటు ఇద్దరు మంత్రులను పంపించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని కూడా స్వయంగా జగనే పర్యవేక్షించనున్నట్లు, తిరుపతి ప్రజల వద్దకు నేరుగా జగన్ వెళ్లనున్నట్లు వైసీపీ పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నిక లో అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవటంతో ఏపీలో చాలా కాలం తర్వాత ఎన్నికల వాతావరణం అలుముకుంది. మరోపక్క బిజెపి ఈ ఉప ఎన్నికలలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ని పోటీ గురించి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నిక ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.


Share

Related posts

టార్గెట్ బండి సంజ‌య్ … రాజాసింగ్ కొత్త గేమ్

sridhar

Indigo airlines : విమానంలో జన్మించిన పాప..!! ఎక్కడంటే..

bharani jella

అమరావతి రైతుల పవర్ ఏంటో జగన్ మోహన్ రెడ్డి కి అర్ధం అయ్యిందా ? 

sekhar