NewsOrbit
న్యూస్

” ఐదు నెలల గండం”: జగన్ కు మనశ్శాంతి లేకుండా చేస్తున్న మ్యాటర్ ఇదే

cm jagan angry of leaking information

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రానున్న ఐదు నెలలు జగన్ కి అత్యంత కీలకమైన సమయమని వారంటున్నారు.

cm jagan angry of leaking information

రాజకీయాల్లో ఎప్పుడూ పూలదండలే కాదు.. రాళ్ల దెబ్బలు కూడా సిద్ధంగానే ఉంటాయి. ప్రస్తుతం ఏపీ సీఎం ఆ జోనార్ లో ఉన్నారట.జగన్ ఎదురుగా నిలిచి గెలవడం కష్టమని టీడీపీకి ఈపాటికే అర్ధమైపోతోంది. ఆయన చేతికి ఎముక లేకుండా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఇలాగే జోరు కొనసాగితే 2024 నాటికి కూడా ఆయన రెండవ విడత అధికారం లోకి రావడం సునాయాసమనే చెప్పాలి. మరి జగన్ ని గద్దె దింపే మార్గం ఏంటి అని ఆలోచన చేసిన టీడీపీ జగన్ పై వైసీపీ మీద ద్విముఖ వ్యూహం అవలంబిస్తోందని సమాచారం. జగన్ సర్కార్ కి వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు మధ్యన ఎడం పెంచడం.

జగన్ మీద అదే పనిగా రాతలు రాస్తూ ఏపీలో ఏదో జరిగిపోతోందని కలరింగ్ ఇవ్వడం. మొదటి దాని వల్ల వచ్చేవి అతి సున్నితమైన ఇబ్బందులు, అవి ఏ వైపునకు దారితీస్తాయో చెప్పడం కష్టమే. ఇక రెండవ దాని ద్వారా వైసీపీలోనూ ఎమ్మెల్యేలలోనూ నైతిక స్థైర్యం దెబ్బతీయడం. ఇలా ద్విముఖ వ్యూహంతో టీడీపీ దాని అనుకూల మీడియా రెడీగా ఉన్నాయట.
మరో వైపు ఏపీలో పెను ఆర్ధిక సంక్షోభం వస్తుందని కూడా టీడీపీ ఆశ పెట్టుకుంటోంది. దాన్ని మరింత చేసి భయపెట్టడానికి ఎటూ అనుకూల మీడియా ఉంది. ఏపీలో కరోనా కారణంగా ఆదాయం దారుణంగా పడిపోయింది. మరో వైపు చూస్తే కేంద్రం సాయం కూడా తగ్గుతోంది.

దీంతో ఈ రెండింటికీ బ్యాలన్స్ చేయడం జగన్ కి కష్టమే కావచ్చు. తొలి ఏడాది ఎలాగోలా నెట్టుకువచ్చిన జగన్ రెండవ ఆర్ధిక సంవత్సరం ఇబ్బందుల్లో పెడితే అది రాజకీయ సంక్షోభంగా మలచాలని కూడా విపక్షం ఆశ పెట్టుకుంది. ఈ అయిదు నెలల్లోనే ఏపీలో అనేక కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటీ అంటే మూడు రాజధానుల మార్పు.

దీన్ని జగన్ ఎలా డీల్ చేస్తాడన్నది కూడా తేలాలి. మొత్తమ్మీద జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా జాగూరకత వహించాలని, లేనిపక్షంలో రాజకీయంగా పెద్ద దెబ్బే తగలగలదని జగన్ సన్నిహితులే ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని కూడా వారు అంటున్నారు. మరి జగన్ ఏ విధంగా విపక్షాలకు కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.

author avatar
Yandamuri

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N