NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : రైతులకు ప్రత్యేక చట్టాలుంటాయా? ఇదేం కొత్త కార్యాచరణ??

YS Jagan :

YS Jagan : రైతు  former ల కోసం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్   police stations పెట్టాలని… రైతులకు చట్టపరంగా రక్షణ వ్యవస్థ అవసరం అంటూ సీఎం జగన్ YS Jagan  మళ్లీ మరో వివాదాస్పద అంశాన్ని తెరమీదకు తెస్తున్న ట్లు కనిపిస్తోంది. రైతులకు ప్రత్యేకంగా చట్టాలు ఏమీ ఉండవు. వారికి సంబంధించిన అన్ని గొడవలు తగాదాలు సాధారణ వ్యక్తులు లాగే పరిష్కరించుకోవాలి. దానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన పేజీలు, కేటాయింపులు, చట్టాలు ఏమీ లేవు. మరి ఇప్పుడు జగన్ చెబుతున్న ప్రత్యేక పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పనులు చేస్తాయి?, పోలీస్ స్టేషన్ ల వల్ల రైతులకు లాభం కలుగుతుందా? వారి రక్షణ అంటే సాధారణ పోలీసులు చేయలేరా? అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కీలకమైన నిర్ణయాలను తీసుకునే వీలుందా? ఇది కూడా న్యాయపరంగా ఎటు వెళ్తుంది?? మళ్లీ కేంద్రంతో చిట్టి పంపించు కునే చెప్పించుకునే అంశం అవబోతుందా అనే అనేక సందేహాలు జగన్ చెప్పిన కొత్త పోలీస్ స్టేషన్ ల విషయంలో వస్తున్నాయి.

YS Jagan is it possible for former police stations
YS Jagan is it possible for former police stations

YS Jagan దిశ చట్టానికే కేంద్రం ఆమోదం లేదు?

తెలంగాణలో ఓ యువతిని అత్యాచారం చేసి అనంతరం తగలబెట్టిన ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశా చట్టం పేరుతో కొత్త చట్టం తీసుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సైతం ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించి కేంద్రం ఆమోదం కోసం పంపింది. దీంతోపాటు హడావిడిగా జిల్లాకొక దిశ పోలీస్ స్టేషన్ తో పాటు, సిబ్బంది నియామకాన్ని చేశారు. ప్రయత్నం అయితే మంచిదే కానీ దానిలో న్యాయపరమైన అంశాలు చూసుకోవడం లోనే ఎక్కడో తప్పు జరుగుతోంది. కొన్ని కీలకమైన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి లేదు. ముఖ్యంగా నేర చట్టాలను చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం కావాలి. దీనిని కేంద్రం న్యాయపరంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దానిలో లోటుపాట్లను పరిశీలించి ఆ చట్టం ఖచ్చితమైన ఫలితాలను ప్రజలకు అందిస్తోంది అని భావిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఎలాంటి చట్టమైన ఆమోదం పొందుతుంది. దిశా చట్టం విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండటంతోపాటు… నేరస్తులకు ఇరవై మూడు రోజుల్లోనే శిక్షపడేలా చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఈ విషయంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని అంశాలను లేవనెత్తి… చట్టాన్ని పాస్ కాకుండా అడ్డుకుంది. ప్రస్తుతం దిశ చట్టం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేషీలో ఉంది. ఇప్పుడు తాజాగా రైతుల కోసం జిల్లాకు పోలీస్ స్టేషన్ వారి గురించి ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకురావడం వల్ల ఇది కూడా ఏమైనా న్యాయ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న అన్న అనుమానం కలుగుతోంది.

భూమి పంచాయతీలే అధికం!

రైతుల కోసం వారి రక్షణ కోసం పోలీస్ స్టేషన్లు పెడతామని జిల్లాలో రైతుల సమస్యలు అన్నీ అక్కడ తీరుతామని వారికి తగిన రక్షణ కల్పిస్తామని జగన్ చెబుతున్నారు. అయితే రైతుల గొడవలు రైతుల తగాదాల నీ భూమి విషయంలోనే ఎక్కువగా వస్తాయి. మరి ఇప్పుడు పెట్టబోయే పోలీస్స్టేషన్లలో అన్ని భూమి పంచాయతీలు చేస్తారా? ఎవరికీ ఎలాంటి రక్షణ కల్పిస్తారు? సివిల్ కేసులు వచ్చే విషయంలో వాటిని ఎలా మళ్లిస్తారు? రైతులు ఘర్షణ పడితే వారికి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు ఎందుకు? సాధారణ పోలీస్స్టేషన్లో సిబ్బందికి సరిపోదా అన్నది ప్రధాన ప్రశ్న. పైగా రైతు పోలీస్ స్టేషన్లు పెడితే సాధారణ పోలీస్ స్టేషన్కు వచ్చే కేసులు ప్రతిదాన్ని అక్కడికి పంపే అవకాశం కూడా లేకపోలేదు. శాంతి భద్రతల విభాగం పోలీసులు దీన్ని నుంచి పక్కకు తప్పుకునే అవకాశం కూడా ఉంది. వీటన్నింటినీ అధిగమించి రైతుల కోసం పోలీస్ స్టేషన్లు పెడితే వాటి విధి విధానాలు ఎలా తీసుకురాబోతున్నారు అన్నది కూడా కీలకమే. ముఖ్యంగా దీని మీద ప్రత్యేకమైన జీవో ఇస్తే అది న్యాయపరంగా వెళితే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా కేంద్రం నుంచి ఎలా అనుమతి తీసుకుంటారు అన్నది కూడా కీలకమే

author avatar
Comrade CHE

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?