Ys Jagan: తెలుగు రాజకీయాలలో వైయస్ జగన్ ఒక సంచలనం అని చెప్పవచ్చు. 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి సొంతంగా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. చాలా ఓపికగా ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కొని.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది.
ఒక ముఖ్యమంత్రి కొడుకు గా అనేక సుఖభోగాలను.. అనుభవించే ఆకాశాలు ఎన్నో ఉన్న… తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఎంతగానో అక్కున చేర్చుకున్న ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జైలు జీవితం సైతం లెక్క చేయకుండా దాదాపు 16 నెలల పాటు అన్యాయంగా జైల్లో పెట్టిన వాటిని తట్టుకుని.. పాదయాత్ర చేసి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రికార్డు విజయం సాధించడం జరిగింది. ఇటువంటి చరిత్ర సృష్టించిన వైయస్ జగన్ బయోపిక్ తెరకెక్కించడానికి సంచలన డైరెక్టర్ మహా.వి.రాఘవ్ పూనుకున్నట్లు సమాచారం.
Read more: Ys Jagan: వైయస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!!
అయితే ఈ బయోపిక్ చిత్రం లో జగన్ పాత్రలో “స్కాం 1992” సినిమాలో నటించిన హీరో ప్రతీక్ గాంధీ నటించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని చిత్రీకరించాలని.. డైరెక్టర్ అనుకుంటున్నట్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి కొడుకు గా.. జైలు జీవితం గడపడం మాత్రమేగాక ప్రాణాలు పణంగా పెట్టి దాదాపు మూడు వేలకు పై గా కిలోమీటర్లు పాదయాత్ర చేయటం సీఎం అవ్వడం తో జగన్ బయోపిక్ కచ్చితంగా ఇండియన్ ఫిలిం స్క్రీన్ లో ఒక సెన్సేషన్ సృష్టిస్తోంది అని సినిమా విశ్లేషకులు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?