NewsOrbit
న్యూస్

మీ నాన్నను చూసి నేర్చుకో జగన్ ! వైకాపాలోనే ఈ కామెంట్ పడింది !!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాదిరి వీడియో కాన్ఫరెన్స్ల పట్ల మోజు పెంచుకున్నట్లు కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.ఇది ప్రమాదకరమైన ధోరణి అని వారు హెచ్చరిస్తున్నారు.

 

జగన్ తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జనం మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పథకాలు అమలు చేసే వారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ కూడా తండ్రి పంధాని అవలంబిస్తే మంచిదని వైకాపా నేతలే సూచిస్తున్నారు.


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితమయ్యారు. పథకాల లబ్దిదారులతో మాట్లాడటం, వారు జగన్ ను కీర్తించడం పరిపాటిగా మారింది. ఎంపిక చేసిన లబ్దిదారులు కావడంతో సహజంగానే కీర్తనలు తప్ప విమర్శలు విన్పించవు. అవి చూసి జగన్ సంబరపడితే చాలదంటున్నారు.
కానీ వీడియోకాన్ఫరెన్స్ ల్లో విన్నది .. చూసింది నిజం కాదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయా? అన్నదే ప్రశ్న. ప్రధానంగా మధ్యతరగతి ప్రజల్లో జగన్ సర్కార్ పట్ల అసంతృప్తి పెరుగుతుందన్నది వాస్తవం. సంక్షేమ పథకాలన్నీ పేద వర్గాలకే అందచేస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. గడచిన ఏడాది కాలంగా ఏపీలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి

మరోవైపు సంక్షేమ పథకాల పేరిట జగన్ కొంతమందికే దోచిపెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అగ్రకులాల్లో కూడా అధమస్థాయిలో ఉన్నవారు లక్షల సంఖ్యలో ఉంటారు. కానీ వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో వారంతా జగన్ సర్కార్ వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ప్రధనంగా సోషల్ మీడియాలో సయితం జగన్ కు ఓసీ వర్గాల నుంచి విజ్ఞప్తులు అనేకం వస్తున్నాయి
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేయడం సరికాదంటున్నారు. జేసీ వంటి సీనియర్ నేతలు సయితం ప్రభుత్వ పథకాలతో జగన్ ఇప్పటి నుంచే ఓట్ల కొనుగోళ్లు ప్రారంభించారంటున్నారు. ఇలా పథకాలను పెంచుకుంటూ కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే జగన్ కు మిగిలిన వర్గాలు దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితమయితే ఫీల్ గుడ్ తప్ప మరేమీ కన్పించదు. ఈ తరహా భ్రమల్లో ఉండే చంద్రబాబు 2019 ఎన్నికల్లో దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేసుకుని అయినా జగన్ తన మార్గాన్ని మార్చుకుంటే మంచిదని వైకాపా నేతలు చెబుతున్నారు.
కేవలం సంక్షేమ పథకాలను అమలు పరిస్తే మరోసారి విజయం దక్కుతుందన్నది జగన్ ఆలోచన. గతంలో 2004లో తన తండ్రి వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే 2009లో కూడా అధికారంలోకి తెచ్చిపెట్టాయని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు.కానీ వైఎస్సార్ నిత్యం జనం మధ్య ఉండే వారన్న విషయాన్ని జగన్ గుర్తించాలని కోరుతున్నారు.మరి మన ముఖ్యమంత్రిగా ఆలకిస్తారా?లేదా ? చూడాలి !







author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju