లండన్ బయల్దేరిన వైఎస్ జగన్ దంపతులు

Share


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి లండన్ బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రిటన్ ఎయిర్‌వేస్ విమానంలో జగన్ దంపతులు లండన్ వెళ్లారు. సుమారు వారం రోజులపాటు వారు లండన్‌లోనే ఉండనున్నారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతున్న కుమార్తె వర్షను చూసేందుకు జగన్ దంపతులు లండన్ వెళ్లారు. తిరిగి ఫిబ్రవరి 26న జగన్ దంపతులు హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

కాగా, అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తన కూతురు లండన్‌లో చదువుతోందని.. బ్రిటన్ వెళ్లి ఆమెను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది. అనంతరం కొన్ని షరతులతో అనుమతిచ్చింది.


Share

Related posts

Varshini wonderful images

Gallery Desk

ఇసుక సమస్యపై లోకేష్ దీక్ష

somaraju sharma

ఈ ఒక్క ‘టీ’ చాలు చాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది

Teja

Leave a Comment