NewsOrbit
న్యూస్

జగన్ పోలిటికల్ కెరీర్ లోనే అతిపెద్ద గుణపాఠం ఇది ! 

జగన్ ఏడాది పరిపాలనలో దాదాపు ప్రజలకు ఇచ్చిన హామీ లలో 90% వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. దేశంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ పని చేయలేదు. ముందుగా అనుభవం లేదు అధికారంలోకి వచ్చి నవ్వులపాలు అవుతాడు..అని జగన్ ని మొదట విమర్శించిన వారే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఫాలో అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతా బాగానే ఉన్నా జగన్ పరిపాలన లో కెరియర్లో ఓ యాంగిల్ లో మాత్రం గట్టిగా దెబ్బతింటున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే మొండితనంగా న్యాయస్థానాలలో వ్యవహరించటం. పరిపాలన పరంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న గాని, న్యాయస్థానాల పరంగా వస్తున్న తీర్పులు ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తున్నాయని వైయస్ జగన్ కి చెడ్డపేరు తీసుకు వస్తున్నాయి అని అంటున్నారు.

Andhra Pradesh to conduct land survey and digitise data for ...

ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మొదటిలో అతడు ఏ ఉద్దేశంతో ఎన్నికలను వాయిదా వేశారో అన్న దాని విషయంలో సరైన క్లారిటీ లేకుండా, జగన్ రాజ్యాంగ పదవిలో ఉన్న అతన్ని కొత్త ఆర్డినెన్స్ తీసుకోవచ్చి పదవి నుంచి తప్పించడం జరిగింది. ఇది జగన్ పొలిటికల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని… హైకోర్టులో కాదు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మొట్టికాయలు వేయించుకోవడం వల్ల జగన్ పరిపాలన పై దేశ వ్యాప్తంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేయడం పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బాబ్డే ఈ వ్యవహారం గురుంచి మాట్లాడుతూ రాజ్యాంగమైన వ్యవస్థలతో ఆడుకోవడం మంచిది కాదంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Andhra Pradesh cabinet approves 3 state capital formula | India ...

అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని ఆర్డినెన్స్ ను ఎలా ఆమోదిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక ప్రభుత్వం ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని, ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే హైకోర్ట్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీంతో యధావిధిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టడం గ్యారెంటీ అవటంతో ఏపీ ప్రభుత్వం పరువు పోయినట్లే అని కాబట్టి న్యాయస్థానాల విషయంలో వైఎస్ జగన్ మొండి వైఖరి పక్కన పెట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని చాలామంది అంటున్నారు. జగన్ ఏడాది పరిపాలనలో ప్రతిపక్షాలతో మరియు ప్రజలతో ఎక్కడ ఇబ్బంది లేకపోయినా, ఆయన పొలిటికల్ కెరియర్ న్యాయస్థానంలో ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో ఈ కోణంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళితే విపక్షాలకు, న్యాయస్థానాలకు ప్రభుత్వంపై విమర్శలు చేసే ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదని చాలా మంది సూచిస్తున్నారు.   

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju