న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ టేబుల్ పై మంత్రుల లిస్ట్..!? ఆ ఒక్క సామాజికవర్గం ఇంకా ఫిక్స్ కాలేదు..!?

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి హాట్ హాట్ చర్చ జరుగుతుంది. ఎవరికి మంత్రి పదవులు వస్తాయి..? ఎవరికి మంత్రి పదవులు ఇవ్వరు..? అనేది వైసీపీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి వద్ద ఓ జాబితా సిద్ధం అయిందని వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి..? ఎవరికి ఇవ్వకూడదు..? పార్టీకి మొదటి నుంచి ఎవరు కష్టపడ్డారు..? ఎవరికి వాయిస్ ఉంది..? ఎవరికి సబ్జెక్టు ఉంది..? అనే విషయాలపై జగన్మోహన్ రెడ్డి కి ఒక క్లారిటీ ఉంది. జగన్ మంత్రి వర్గంలో సబ్జెక్టు ఉన్న వాళ్ళ కంటే వాయిస్ ఉన్నవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత. ప్రస్తుత మంత్రివర్గంలో తానేటి వనిత, పుష్ప శ్రీవాణి లాంటివారు ఎవరికైనా తెలుసా అంటే.. పెద్దగా తెలియదు. కానీ కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ అలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. వాయిస్ ఉన్న వాళ్ళు.. ప్రతిపక్షాలపై గట్టిగా మాట్లాడగలిగే వాళ్లు మంత్రులుగా సమర్థ నీయులు అని వైసీపీ అంతర్గతంగా భావిస్తోంది.

YS Jagan New cabinet list
YS Jagan New cabinet list

YS Jagan: ఎస్టీ నేతకు స్పీకర్..?

ఇప్పుడు రాబోయే రెండు సంవత్సరాలు చాలా కీలకం. ప్రతిపక్షాలు ఏదైనా శాఖపై ఆరోపణలు చేస్తే వాటిని సబ్జెక్ట్ పరంగా కాకపోయినా ఎదురుదాడి చేసి సమర్థనీయంగా తిప్పి కొట్టేవాళ్ళు కావాలి. ఇప్పుడు మంత్రి వర్గానికి సంబంధించి జగన్ సామాజిక వర్గ సమీకరణలను ఫిక్స్ చేసుకుంటున్నారు. ఎస్టిలో ఒకరికి మంత్రిగా ఇవ్వాలి లేకపోతే స్పీకర్ గా అయినా ఇవ్వాలి అనుకుంటున్నారట. ఇప్పటికే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కు స్పీకర్ గా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బీసీల్లో ఎనిమిది లేదా తొమ్మిది మందికి అవకాశం ఇవ్వాలని, రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురిని, కాపులు నుండి ఇప్పుడు ఐదుగురు ఉండగా దాన్ని 4కు తగ్గించి ఒకటి బి సి పెంచాలని ఆలోచనలో ఉన్నారట. ఎస్సీల నుండి ప్రస్తుతం నలుగురు ఉండగా ప్రస్తుతం నలుగురు ఉండగా అని 5 కు పెంచాలని ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

YS Jagan: రెడ్డి వర్గం నుండి రేసులో 25 మంది

ఆర్య వైశ్యులు నుండి ఒకరిని కొనసాగిస్తూ బ్రాహ్మణులకు ఒకటి కేటాయించాలని చూస్తున్నారట. రాజుల విషయానికొస్తే శ్రీరంగనాథరాజు స్థానంలో ప్రసాద్ రాజును తీసుకోవాలని, ఆర్య వైశ్యులలో వెల్లంపల్లి స్థానంలో కోలగట్ల వీరభద్ర స్వామి కానీ అన్నా రాంబాబు గాని అలానే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే కోన రఘుపతి గాని మల్లాది విష్ణు కానీ అవకాశం ఇవ్వచ్చు. ఇలా అన్ని సామాజిక వర్గాలకు ఒక ఐడియా ఉంది. కానీ రెడ్డి సామాజిక వర్గానికి వస్తేనే జగన్ కు ప్రెజర్ ఎక్కువ అవుతోంది. తేల్చటం ఇబ్బందిగా ఉంది. ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఎందుకంటే… ఒక్క రెడ్డి సామాజిక వర్గం నుండే దాదాపు 25 మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వీళ్లంతా కూడా ఆ జిల్లా రాజకీయాల్లో జగన్ కు మొదటి నుండి కలసి ఉన్నవాళ్లే.

చిత్తూరు జిల్లా నుండే నలుగురు

ఉదాహరణకు చూస్తుంటే చిత్తూరు జిల్లా నుండి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనంతపురం జిల్లా నుండి కేతిరెడ్డి సోదరులు, కర్నూలు జిల్లా నుండి శిల్పా సోదరులు, నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గుంటూరు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, జగ్గిరెడ్డి ఇలా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఉన్నారు.

 

జాక్ పాట్ కొట్టే ఆ ముగ్గురు ఎవరో..?

ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురు మంత్రులలో మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా జగన్ కు అత్యంత సన్నిహితులు. పెద్దిరెడ్డి సీనియర్ మంత్రి. జగన్ మంత్రివర్గంలో కీలకమైన నాయకుడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి మంచి సబ్జెక్టు ఉంది. ఆయనకు ఉన్న నాలెడ్జి ఎవరికీ లేదు. వీళ్లిద్దరు తొలగించటానికి వీలు లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు. ఆయన తొలగించడం ఒక రకమైన ఇబ్బంది. ఈ ముగ్గురిలో ఎవర్ని తొలగించాలో తెలియక కొత్తగా ఎవరు తీసుకోవాలో తెలియక ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా టెన్షన్ పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు అని వైసీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మంత్రి పదవి ఆశిస్తున్నా 25 మందిలో ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం ఇవ్వొచ్చు. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు అనేది వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది.


Share

Related posts

AP Capital: అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ నిధుల విడుదల..! మరో సారి హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశం..!!

somaraju sharma

హిందూ ఆధిపత్య ఇండియా ఈ ‘సన్యాసి’ లక్ష్యం!

Siva Prasad

Puri jagannath: ‘జనగణమన’ స్టోరి లైన్ లీక్..అందుకే మహేశ్ రిజెక్ట్ చేశాడా..?

GRK