NewsOrbit
న్యూస్

జగన్ సరికొత్త ఎత్తుగడ ఎవరూ ఊహించనిది !

బోల్డ్ అండ్ స్పీడ్ నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటి రారు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ys jagan strategy
ys jagan strategy

అలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆయన మొహమాటాలు కూడా పెట్టుకోరు.అదే తీరులో ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఎంతోమందికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ జాబితా చాంతాడంత ఉంది. తాజాగా కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం వచ్చింది. వాటిలో రెండింటిని ఇటీవలే భర్తీ చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న ఒక స్థానంలో అనూహ్యంగా మొన్న మరణించిన పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేశారు. సాంబశివరాజు మరణించిన పక్క రోజే జగన్ ఏ నిర్ణయం తీసుకోవటం ఇక్కడ గమనార్హం.

ఇది పార్టీ వర్గాలను విస్మయపరిచింది.నిజానికి పెన్మత్స సాంబశివరాజు బొత్స గురువు. కానీ తర్వాత తన గురువుకే బొత్స ఎసరు పెట్టారు. ఆ తర్వాత బొత్సకంటే ముందే వైసీపీలో చేరారు. అక్కడా ఆయనకు టిక్కెట్ రాకుండా బొత్స చేశారు. 2019 ఎన్నికల్లో నెలిమర్ల టిక్కెట్‌ను పెనుమత్స సాంబశివరాజు కుమారుడు సురేష్‌కి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత బొత్స రాజకీయంతో ఆయన స్థానంలో బొత్స సోదరుడు అప్పలనాయుడికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు పూర్తిగా రాజకీయంగా కనుమరుగయారు.ఆయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి సురేష్ పోటీ చేసి ఓడిపోయారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకపోయినప్పటికీ బొత్స సోదరుడు గెలుపునకు కృషి చేశారు. ఇవన్నీ గుర్తుంచుకున్న జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సురేష్ కిఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేష్ కి ఈ పదవి ఇవ్వటం మంత్రి బొత్స కి ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి వాటిని వేటినీ జగన్ పరిగణనలోకి తీసుకోకుండా తన మనస్సాక్షి ప్రకారం నడుచుకొని తనను నమ్ముకున్న వారికి తప్పక న్యాయం చేస్తాడని రుజువు చేసుకున్నారు. దటీజ్ జగన్ అని వైసిపి వర్గాలు అంటున్నాయి.

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju