NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subbareddy: బాబాయ్ నీ టెన్షన్ పెట్టేస్తున్న అబ్బాయ్!సుబ్బారెడ్డిని సూపర్ సిఎం ఏం చేయబోతున్నారు ?

YV Subbareddy: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు.ఎవరిని అనుగ్రహిస్తారో,ఎవరిపై ఆగ్రహిస్తారో కూడా అంతుబట్టదు.పదవుల పందేరంలో జగన్ కో స్పెషల్ ఫార్ములా ఉందనిపిస్తోంది.ఈ విషయంలో బంధుత్వానికి కూడా అతీతంగా జగన్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.ఇందుకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ రెన్యువల్ చేయకపోవడం నిదర్శనం.

YS Jagan Puts YV Subbareddy in tension
YS Jagan Puts YV Subbareddy in tension

ఈ నెల 20 తో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగిసింది.మళ్లీ ఆయనకే మరో రెండేళ్లు రెన్యువల్ ఇస్తారని అందరూ ఊహించారు.కానీ ఇందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వం బుధవారం నాడు టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చైర్మన్ గా,ఏఈవో కన్వీనర్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు అయ్యింది.పాలక మండలి కి ఉన్న అన్ని అధికారాలు స్పెసిఫైడ్ అథారిటీ కి ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.ఈ చర్య రాజకీయ వర్గాల్ని విస్మయంలో ముంచెత్తింది.

మధ్యలో ఏం జరిగిందంటే?

పదవీకాలం ముగుస్తుండటంతో ఈమధ్యే వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డినికలిసి తనకు మరోసారి రెన్యువల్ వద్దని ,రాజ్యసభకి పంపమని కోరారట.అయితే వచ్చే ఏడాది జూన్ వరకు రాజ్యసభలో వైసిపి కొత్త సభ్యులు ప్రవేశించే అవకాశం లేదు.అప్పుడు నాలుగు స్థానాలు ఖాళీలు అవుతాయి. అందులో విజయ సాయిరెడ్డి సైతం పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు రెన్యువల్ చేస్తే రెండో సీటు రెడ్డి వర్గానికే ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో..సీఎం జగన్ దాని పైన ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.దీంతో సుబ్బారెడ్డి మెత్తబడి టీటీడీ చైర్మన్ పదవి రెన్యూవల్ కే అంగీకారం తెలిపి వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సునాయసంగా సుబ్బారెడ్డికి రెన్యువల్ లభిస్తుందని అందరూ భావించారు.అయితే అనూహ్యంగా స్పెసిఫైడ్ అథారిటీ బోర్డు ఏర్పాటైంది.

హతాశులైన సుబ్బారెడ్డి అనుచరులు!

టీటీడీ చైర్మన్ పదవి లో సుబ్బారెడ్డి మరో రెండేళ్లు కొనసాగుతారని ఆశించిన ఆయన అనుచరులు స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుతో హతాశులయ్యారు.జగన్ ఎందుకిలా చేశారని వారు తర్జనభర్జన పడుతున్నారు.మరోవైపు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి ఈసారి తనకు టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడడంతో జగన్ పునరాలోచనలో పడ్డారన్నది ఇంకో కథనం.సుబ్బారెడ్డి కూడా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు నిర్ణయంపై మధనపడుతున్నారని,గతంలో ఎంపీ పదవి, ఇప్పుడు టిటిడి చైర్మన్ పదవి జగన్ వూడగొట్టారని మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.టీటీడీ చైర్మన్ పదవి రెన్యువల్ కాకపోతే సుబ్బారెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది వైసిపిలో చర్చనీయాంశంగా మారింది.

 

author avatar
Yandamuri

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju