NewsOrbit
న్యూస్

శిద్దా కోరిన కోరికకు జగన్ నో నో నో !

ఇవాళో రేపోవైసిపిలో చేరబోతున్న ప్రకాశం జిల్లా మాజీ మంత్రి శిద్దారాఘవరావు కోరిన ఒక కోరిక కు వైసిపి అధిష్టానం నో చెప్పినట్లు సమాచారం.

తొలుత శిద్ధారాఘవరావు తమ వ్యాపారాలను పరిరక్షించుకోవడానికి ఆయన సోదరులను వైసీపీలోకి పంపారు. తాను టీడీపీలో ఉండాలని నిర్ణయించుకున్నారు.కుమారుడు వెంకటేష్ బాబును వైసిపి లో చేర్పించి, తాను మాత్రం ఆధికార పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తున్న చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం తరహాలో తాను కూడా ఉంటానని శిద్దారాఘవరావు వైసీపీ అధిష్టానానికి సంకేతాలు పంపారు. కానీ అందుకు వైసీపీ అధిష్టానం అంగీకరించలేదు.తప్పనిసరిగా పార్టీలో చేరవలసినదేనని జగనే స్పష్టం చేయడంతో ఆయన నేరుగా వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.నిజానికి శిద్ధా రాఘవరావు వల్ల వైసీపీకి అదనంగా చేకూరే ప్రయోజనం లేదు. ఆయన సామాజికవర్గం పరంగా చూసుకున్నా పెద్దగా వైసీపీ లబ్ది పొందేది లేదు. అయినా టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతోనే శిద్ధా రాఘవరావును పార్టీలో చేర్చుకుంటున్నారని తెలుస్తోంది. 1999లో టిడిపిలో చేరిన సిద్ధ రాఘవరావు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి పెద్ద పెద్ద ఆదాయ వనరుగా మారారు. టిడిపి కోశాధికారిగా కూడా సిద్ధా రాఘవరావు పనిచేశారు .ఆయనకూడా విధిలేని పరిస్థితుల్లో వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. శిద్ధా రాఘవరావు గత కొంతకాలంగా వ్యాపార నష్టాలతో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వం కూడా ఆయన గ్రానైట్ వ్యాపారాలకు వందకోట్లు జరిమానా విధించింది. ఈసమస్యలన్నీ ఎందుకు అన్న ఉద్దేశంతో సిద్ధా రాఘవరావు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నేతలు కదిరి బాబూరావు, జూపూడి ప్రభాకర్ రావు వంటి నేతలు వైసీపీలో చేరిపోయారు. టీడీపీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే శిద్ధా రాఘవరావును పార్టీలో చేర్చుకుంటున్నారు. అంతకు మించి ఆయన వల్ల పెద్దగా వైసీపీకి ప్రయోజనం ఏమీ ఉండదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!