ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: వాళ్లకు కీలక హెచ్చరిక చేసిన సీఎం వైఎస్ జగన్..!!

YSRCP Some Leaders Trouble to Face Jagan
Share

YS Jagan: రైతులకు కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణ పై సమీక్ష నిర్వహించారు., ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సేంద్రీయ, ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల స్థానంలో ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతుల ద్వారా పంట సాగును ప్రోత్సహించాలన్నారు. రైతులకు కల్తీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలనీ, వారికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే దీని కోసం చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందించాలన్న సదుద్దేశంతో క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారి తీశాయన్నారు. వీటిని నిరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిని తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు. డిమాండ్ మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

YS Jagan review meeting
YS Jagan review meeting

YS Jagan: ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన, సాగు చేసే వారికి తగిన తోడ్పాటు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు అయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్యాయ పంటల ద్వారా రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వరి పండిస్తే వచ్చే అదాయం మిల్లిట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలన్నారు. దీని కోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. మిల్లిట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిల్లిట్స్ ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రొససింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

Read More: YS Jagan: జగన్ బుర్రలో 5 ఆలోచనలు..! ఆ కీలక నేతలకు షాక్ తప్పదు..!!


Share

Related posts

Parvati Nair Beautiful Lucks

Gallery Desk

The Warrior: ముఖ్యఅతిథిగా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్..!!

sekhar

Crime: మాస్క్ లేదని పోలీస్ లు మేకులు దించారు..! వాస్తవం కాదంటున్న అధికారులు..!!

bharani jella