NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర లేదట!చంద్రబాబు ఎపిసోడ్ లో మరుగునపడిపోయిన సీఎం జగన్ కీలక ప్రకటన!!

YS Viveka Murder Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక కీలక ప్రకటన శాసన సభలో చంద్రబాబునాయుడు ఎపిసోడ్ మధ్యలో మరుగున పడిపోయింది.మామూలుగా అయితే తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చేసిన ఆ ప్రకటన మీడియాలో ప్రధాన వార్తగా మారేది.అయితే వ్యూహత్మకంగానే జగన్ ఆ గొడవలోనే వివేకా హత్యపై తాను చెప్పాల్సింది చెప్పేసి చేతులు దులిపేసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

YS Jagan says there is no Avinash Reddy's role in YS Viveka murder Case
YS Jagan says there is no Avinash Reddys role in YS Viveka murder Case

ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి సిబిఐ కి ఇచ్చిన నేర అంగీకార పత్రం ప్రకారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో సహా నలుగురు ఈ హత్యకు కారకులని వెల్లడించడం తెలిసిందే.ఆ నలుగురిలో ఒకరైన వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి ని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేయడం కూడా విదితమే.ఇవాళో రేపో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతున్నారన్న వార్తలు వస్తున్న తరుణంలో సీఎం జగన్ ఆయనకు అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చేశారు.ఇది ఈ కేసును మలుపుతిప్పే మరో అంశం.

YS Viveka Murder Case: జగన్ చెప్పిందేమిటంటే?

“వివేకానందరెడ్డి నా బాబాయ్.అవినాష్ రెడ్డి నా ఇంకో బాబాయ్ కొడుకు.అతడు ఎందుకు తనకు కూడా బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని చంపుతాడు?ఎవరైనా తన కంట్లో తనే పొడుచుకుంటారా”అని జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో వివేకా హత్యపై స్పందించారు.తద్వారా అవినాశ్ రెడ్డి కి ఆయన ఉత్తమ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చినట్లయింది.అంతేగాకుండా బాబాయ్ హత్య విషయంలో జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఏమిటో కూడా చెప్పకనే చెప్పినట్లయింది.

టిడిపి చేయించి ఉండొచ్చు కదా?

అంతటితో ఆగకుండా జగన్ మోహన్ రెడ్డి ఈ హత్యను టిడిపికి రుద్దే ప్రయత్నం కూడా చేశారు .అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఈ హత్య చేయించి ఉండొచ్చు కదా అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడగొట్టేందుకు అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అరాచకాలకు పాల్పడ్డాడని సీఎం జగన్ తెలిపారు.ఇప్పుడు వైసీపీని బద్నాం చేసేందుకు వివేకానందరెడ్డి హత్య కేసు ను వక్రీకరిస్తూ వైసిపి నేతలకు ఆపాదించే ప్రయత్నాలను టిడిపి నాయకులు చేస్తున్నారన్నారు.అయితే పైన దేవుడున్నాడని, అన్నీ చూస్తున్నాడని,ఎవర్ని ఏంచేయాలన్నా ఆయనే చేస్తాడని ముఖ్యమంత్రి ముక్తాయింపు ఇచ్చారు.సీఎం ప్రసంగం లో టీడీపీపై ఆరోపణలు రొటీనే కానీ ఎంపీ అవినాశ్ రెడ్డి కి సమర్ధన మాత్రం అండర్ లైన్ చేయాల్సిన అంశం.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!