NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupati By Poll: తిరుపతిలో పవన్ పై వైఎస్ జగన్ వ్యూహమిదేనా..!?

ys jagan strategy on pawan in tirupati

Tirupati By Poll: తిరుపతి ఉప ఎన్నిక Tirupati By Poll దగ్గరపడుతోంది. పార్టీలన్నీ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. పార్టీ ఉనికి చాటాలని చంద్రబాబు పోరాడుతున్నారు. పట్టు సాధించాలనేది బీజేపీ-జనసేన కూటమి ఆశ. అధికారంలో ఉన్న వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ ప్రయత్నాలు చూస్తుంటే టీడీపీని పెద్దగా లెక్కలోకి తీసుకోనట్టే అనిపిస్తోంది. బీజేపీని కూడా వైసీపీ అంతగా పట్టించుకోదనే చెప్పాలి. కానీ.. మీ వెనకాల ఏదో పవర్ ఉంది.. అన్నట్టు పవన్ దోస్తీతో బీజేపీ ధృడంగా కనిపిస్తోంది. ఇది పవన్ పర్యటనతో తేటతెల్లమైంది. దీంతో రంగంలోకి దిగిన వైఎస్ జగన్ తండ్రి వైఎస్సార్ నాడు చిరంజీవి విషయంలో చూపిన స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ys jagan strategy on pawan in tirupati
ys jagan strategy on pawan in tirupati

2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక కాంగ్రెస్ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఐదేళ్లూ సీఎంగా ఉన్నారు. అయితే.. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని తెలిసి వైఎస్ చాన్స్ తీసుకోలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను తమకే అనుకూలంగా ఉండే వ్యూహం వేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇది వైఎస్ కు లాభించింది. వైఎస్ కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా కాంగ్రెస్ కు ఓట్లు పోవు. కానీ.. చిరంజీవి రావడం ద్వారా టీడీపీకే ఓట్లు చీలుతాయని భావించారు. సామాజికవర్గ ఓట్లు చీలి ప్రజారాజ్యంకు పడ్డాయి. టీడీపీకి తగ్గాయి. 2004లో కాంగ్రెస్ 224 సీట్లు సాధిస్తే.. 2009లో 156 సీట్లు వచ్చాయి. ఆమేరకు వైఎస్ ముందుచూపు, ఆలోచన ఫలించి కాంగ్రెస్ మళ్లీ అధికారం చేపట్టింది.

 

ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ కు పవన్ సినిమా కనిపించింది. దీంతో సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారు. స్వతహాగా తిరుపతిలో ఎక్కువగా ఉండే బలిజ ఓట్లు బీజేపీ-జనసేనకు పడితే.. ఓట్లు చీలి టీడీపీకి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉండదు. సీఎం జగన్ కు ఉన్న ఇమేజ్, కార్పొరేషన్ ఎన్నికల విజయం, సంక్షేమ పథకాల దృష్ట్యా ప్రభుత్వ అనుకూల ఓట్లు వైసీపీకి పడతాయి. ఫలితంగా గెలుపు సాధించొచ్చనే వ్యూహంతో జగన్ ముందుకెళ్తున్నారని చెప్పాలి. మరి.. ఎవరి వ్యూహాలు, ప్రయత్నాలు ఫలిస్తాయో వేచి చూడాలి.

author avatar
Muraliak

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?