NewsOrbit
న్యూస్

వైయస్ జగన్ టోటల్ రాంగ్ స్ట్రాటజీ ! అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నావు గురూ!

బీసీలపై అతి నమ్మకం పెట్టుకుని ఓసీలను దూరం చేసుకుంటున్న వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ రాజకీయ రాజకీయ వ్యూహం భవిష్యత్తులో వికటించగలదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

ys jagan wrong strategy
ys jagan wrong strategy

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కి 151 సీట్లు వచ్చాయి అంటే అన్ని వర్గాలు ఆ పార్టీని ఆదరించాయని అర్థం.ఇందులో బీసీలు కూడా ఉండొచ్చు కానీ వారి వల్లనే వైసిపి ఇంత ఘనవిజయం సాధించిందని భావించడం కరెక్టు కాదని వారంటున్నారు.కానీ ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ బిసిల జపం ప్రారంభించారు.వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణలకు ఆయన ఇచ్చారు.వారి స్థానాల్లో బీసీలనే మంత్రులుగా కూడా తీసుకున్నారు.

కానీ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి విశ్లేషిస్తే ఔనన్నా కాదన్నా బీసీలు టిడిపికి కంచుకోట.మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో జగన్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ నినాదంతో వారు కూడా ఆయన వైపు మొగ్గు చూపారు తప్ప పూర్తిగా వైసీపీ వైపు తిరిగి పోలేదు.కానీ జగన్ మాత్రం బీసీలంతా వైసీపీలోకి వచ్చేశారు అన్న భ్రమలో ఉన్నారంటున్నారు.జగన్ ప్రభుత్వం పదవులు ఇవ్వాలంటే బీసీలే కొలమానంగా పెట్టుకుంటోంది. జగన్ లెక్కలు వేరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలుపుకుంటే బాహుబలిగా వైసీపీ మారుతుందని అంచనా వేస్తున్నారట .నిజానికి కాంగ్రెస్ పార్టీకి అగ్రకులాలు, ప్రత్యేకించి రెడ్లు పూర్తి అండగా నిలబడతారు.

గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెడ్లకు టాప్ ప్రియారిటీ ఇచ్చేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. జగన్ రెడ్ల ని దగ్గరకు రానివ్వడం లేదని ఆ సామాజిక వర్గంలో అసమ్మతి రగులుతోంది.బీసీలను అంతగా నమ్మటం మంచిది కాదని వైసిపి వర్గాలు గొనుకుంటున్నాయి.బీసీల ఓటు బ్యాంక్ ఎపుడూ టీడీపీకి పెట్టని కోటే. ఒకే ఒక ఎన్నిక అదీ 2019లోనే వైసీపీ వైపుగా ర్యాలీ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బాబు ఆ అయిదేళ్లూ కాపులను బీసీల్లో చేరుస్తామని లేనిపోని హామీలు గుప్పించి వారి జపం చేశారు. బీసీలు ఎటూ తమవైపే కదా అని కడు ధీమా ప్రదర్శించారు. దాంతోనే వారంతా బాబుని వదిలి వైసీపీ వైపు చూశారు. అలా టీడీపీ పెట్టాక తొలిసారి వారు పసుపు పార్టీకి దెబ్బకొట్టారు. 2024 ఎన్నికలకు ఆ పరిస్థితి ఉంటుందా? అంటే చెప్పలేమనే అంటున్నారు.

బీసీలు గుత్తమొత్తంగా వైసీపీకి ఓటు వేసే సీన్ ఉండకపోవచ్చు. మరి వారినే నమ్ముకుని ఓసీలను, తనను వైఎస్సార్ ని దశాబ్దాల తరబడి అట్టిపెట్టుకుని ఉన్న రెడ్లను, ఇతర అగ్ర కులాలను జగన్ కనుక దూరం చేసుకుంటే రాజకీయంగా గట్టి షాకులు తగులుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే జగన్ తో ఉన్న సమస్యేమిటంటే ఆయన అనుకున్నది చేస్తారు తప్ప అందరి అభిప్రాయాలు తీసుకోరు.కాని సుదీర్ఘకాలం అధికారం లో ఉండాలంటే జగన్ బిసిలనే కాకుండా అన్ని వర్గాలను కూడా అక్కున చేర్చుకోవడం ఎంతైనా అవసరమని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N