తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: అమిత్ షా ప్రసంగంపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Share

YS Sharmila: కేంద్ర మంత్రి అమిత్ షాపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు విచ్చేసిన అమిత్ షా కేసిఆర్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అమిత్ షా ప్రసంగంపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టబద్దంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు ఇక ఏం మొహం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని ప్రశ్నించారు షర్మిల.

YS Sharmila: ఊదు కాలదు..పీరు లేవదు

అమిత్ షా మాటలకు ఊదు కాలదు..పీరు లేవదు అన్న తెలంగాణ సామెతను వివరించారు. “అవినీతి చేస్తున్నారని తెలిసి కూడా మీ పాత మిత్రుడు కేసిఆర్ ని అరెస్టు చేయరు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకంలో వాటా ఉందన్న మీరు.. కేసిఆర్ అవినీతిలో మీకు వాటా లేదంటే నమ్మాలా..?” అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిచ్చారని ఇక తెలంగాణలో కూడా ఇస్తారా..? అని ఎద్దేవా చేశారు.

“కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా..? రైతులను కార్లతో గుద్దిచంపిన మీరు మా రైతాంగాన్ని ఆదుకొంటామని చెవిలో పూలు పెడుతున్నారా..?”అని ప్రశ్నించారు. “నిలబెట్ట చేతగాదు గానీ కూలగొట్టడంలో దిట్టలు మీరు. మైనార్టీలను బలిపశువులను చేసి అధికార పీఠాలకు ఎక్కుతున్న మీరు వాళ్లకున్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసెయ్యడం కాక ఇంకేం ఆలోచించగలరు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ మోడి, షా కలిసొచ్చినా పీకెయ్యలేరు. మీ మతోన్మాదాన్ని ఎదిరించగలగేది వైెఎస్ఆర్ స్పూర్తి మాత్రమే”నని షర్మిల అన్నారు.


Share

Related posts

TDP YSRCP: చంద్రబాబు – మంత్రి అప్పలరాజు మధ్య కేసులాట..! నేడు మళ్ళీ మంత్రిపై..!!

somaraju sharma

వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ది ఎందరికో తెలుసా..?

somaraju sharma

Water : మూలిగే నక్కపై జల పడగ! తెలుగు రాష్ట్రాలకు కొత్త సమస్య!

Comrade CHE