NewsOrbit
న్యూస్

Telangana టీఆర్ఎస్ నోరెత్తలేని రీతిలో షర్మిల స్కెచ్ ! అనతి కాలంలో ఆరితేరిపోయిన అతివ!

YS Sharmila Party ; 50 వేల మందితో చర్చలు..! లక్షలాది మందితో బహిరంగసభ..!? షర్మిల ప్లాన్ సూపర్..!! 

Telangana తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అందులోభాగంలో రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్‌పాండ్‌లో జరిగిన ఈ సమావేశానికి  దాదాపు 500 మంది దాకా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించినట్లు సమాచారం. షర్మిల ఒక్కసారి ఈ నినాదం ఇవ్వడంతో అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు. తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారు.

YS Sharmila Party ; 50 వేల మందితో చర్చలు..! లక్షలాది మందితో బహిరంగసభ..!? షర్మిల ప్లాన్ సూపర్..!! 

bhemఇటీవల షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్,‌ ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఇప్పుడు షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే నినాదం రావడంతో ప్రధానంగా టీఆర్‌ఎస్‌పైనే ఆమె గురిపెట్టినట్లు అర్థమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని నిర్ణించుకోవాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telangana తెలంగాణ కోడలు ఇమేజ్ తో జనాల్లోకి!

ఇక ఏపీకి చెందిన షర్మిల, ఇక్కడ పార్టీ పెట్టడమేంటంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు ఆమె సరైన సమాధానాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ కోడలు హోదాలో జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించగానే.. అధికార టీఆర్‌ఎస్‌ సహా ప్రత్యర్థి పార్టీల నేతలు మొదటగా ఆమె స్థానికురాలు కాదన్న సంగతిని లేవనెత్తిన విషయం తెలిసిందే. తెలంగాణ కోడలు హోదాతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది తన మెట్టినిల్లు అని, తెలంగాణ కోడలికి రాజకీయంగా ఇక్కడ హక్కులు ఉండవా? అన్న నినాదంతో విమర్శలకు సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ పోరాట యోధుల చరిత్రనూ షర్మిల బృందం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన భీం రెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం వంటి పలువురు తెలంగాణ కమ్యూనిస్టు యోధులకు తగిన గుర్తింపు లేదని, నల్లగొండ జిల్లాలో ఏదైనా జాతీయ రహదారి, ప్రాజెక్టు.. మరో కట్టడానికో వారి పేర్లు పెట్టేలా భవిష్యత్తులో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే తెలంగాణలో మరుగున పడ్డ యోధుల చరిత్రను వెలికితీసే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. షర్మిల పట్టుదల కలిగిన మహిళా నాయకురాలని, పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగిందని ఇవన్నీ గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

author avatar
Yandamuri

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk