తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: సీఎం కేసిఆర్ పై విమర్శలు, ఆరోపణలు – కుమారుడు కేటిఆర్ కు వైఎస్ షర్మిల మద్దతు..మేటరేమిటంటే..?

Share

YS Sharmila: టీఆర్ఎస్ సర్కార్ ను, సీఎం కేసిఆర్ ను నిత్యం విమర్శించే వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మొదటి సారి సీఎం కేసిఆర్ తనయుడు, మంత్రి కేటిఆర్ కు మద్దతుగా నిలిచారు. ఓ సంఘటన ఆమెకు బాధకల్గించింది. దానిపై స్పందించి కేటిఆర్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. బీజేపీ నేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్.. అటు కేటీఆర్, ఆ పార్టీ శ్రేణులను ఆగ్రహం తెప్పించింది. రాష్ట్రంలో అభివృద్ధి పోల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న ఓ ట్వీట్ చేశారు. ఇది కేటిఆర్ కుమారుడు హిమాన్షును కించపరిచేలా ఉంది. దీనిపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేటిఆర్ కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. “పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటన సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా, మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి” అని షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు.

 

YS Sharmila: తీన్మార్ మల్లన్న పై దాడి

తీన్మార్ మల్లన్న అభివృద్ధి పై పోల్ నిర్వహిస్తూ.. “అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా?” అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టు టీఆర్ఎస్ వర్గీయులను ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆవేశంతో కొందరు టీఆర్ఎస్ సానుభూతిపరులు శుక్రవారం రాత్రి బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై మల్లన్న టీమ్ సభ్యుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ ఖండించారు.


Share

Related posts

మీరు SBI ఖాతాదారులా? అయితే మీ ఫోన్‌లో వుండకూడనివి ఇవే.!

Ram

అబ్బాయికి కూడా టికెట్ కావాలి!

somaraju sharma

దాచాలంటే దాగవులే !నంద్యాల ఉప ఎన్నిక మర్చిపోతే ఎలా జగనన్నా?

Yandamuri