YS Sharmila: షర్మిలకు చుక్కలు కనిపించేలా తీన్మార్ మల్లన్న పెట్టిన ఫిట్టింగ్ మామూలుగా లేదుగా ?

YS sharmila tweet on ap Telangana water dispute issue
Share

YS Sharmila: ఎంతైనా జర్నలిస్టు జర్నలిస్టే!సమర్థుడైన జర్నలిస్టు సరైన పాయింట్ లేవనెత్తితే ఎంతటివారైనా సతికిల పడాల్సిందే.సమాధానం చెప్పలేక దిక్కులు చూడాల్సిందే.ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కు ఎదురైంది.తెలంగాణాలో పేరుమోసిన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బయట పెట్టిన ఒక ముఖ్యమైన పాయింట్ తో షర్మిల ఇరకాటంలో పడ్డారు.ఇప్పటి వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ , టిడిపి వంటి ఏ ప్రధాన పార్టీలు కూడా చేయలేనంతగా తీన్మార్ మల్లన్న ఆ ఒక్క పాయింట్ తో షర్మిలను కార్నర్ చేసేశారు.

YS Sharmila Vs Teenmar Mallanna
YS Sharmila Vs Teenmar Mallanna

విషయం ఏంటంటే!

తెలంగాణలో పార్టీ పెట్టాలి అనుకున్నప్పటి నుంచి షర్మిల ఎవరూ తన ప్రాంతీయత గురించి ప్రశ్నించకుండా తను తెలంగాణ కోడలినని చెప్పుకుంటూ వస్తున్నారు.తన పిల్లలు కూడా ఇక్కడే పుట్టారని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ఒక అస్త్రాన్ని బయటకు తీశారు. రాజ‌న్న బిడ్డ ష‌ర్మిల తాను తెలంగాణ బిడ్డ‌న‌ని చెప్పుకుంటున్నార‌ని, మ‌రి ఆమె ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు పులివెందుల్లో ఉన్నాయని మ‌ల్ల‌న్న వెల్లడించడం సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

YS Sharmila: పులివెందులలోనే షర్మిలకు ఓటు!

తీన్మార్ మల్లన్న చెప్పింది నిజమే.షర్మిల కు పులివెందులలోనే ఓటు ఉంది.2014, 2019, అంత‌కు ముందు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ ష‌ర్మిల త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జ‌య‌మ్మ కాల‌నీలోని ప్రాథ‌మిక పాఠ‌శాలలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.రికార్డులను బట్టి చూసినా ఇది రుజువవుతోంది.ఆమె ఆధార్ కార్డు కూడా పులివెందుల చిరునామాతోనే ఉన్నట్లు తీన్మార్ మల్లన్న చెప్పాడంటే జర్నలిస్ట్ కాబట్టి అతను అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడి ఉంటాడని భావించాల్సి ఉంటుంది.దాన్ని ప‌ట్టుకుని నెటిజ‌న్లు ష‌ర్మిల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీస్తున్నారు.ష‌ర్మిల తెలంగాణ బిడ్డ అయితే ఇక్క‌డ ఓటు వేయ‌కుండా పులివెందుల్లో ఎందుకేస్తున్న‌ట్టు? అని తెలంగాణ వాదులయిన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంత‌కూ తెలంగాణ బిడ్డ‌వైతే మీ ఆధార్‌, ఓట‌రు కార్డులోని చిరుమానాలేంటో బ‌య‌ట పెట్టాల‌ని నిల‌దీస్తున్న వాళ్ల‌కు షర్మిల త‌ప్ప‌క స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది షర్మిలకు అగ్ని పరీక్షే.మరి రాజన్న బిడ్డ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

 


Share

Related posts

అమెరికా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నా కరోనా.. ఒక్క రోజులో?

Teja

Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.అధిక లాభాలు కలుగుతాయి !

Sree matha

క్రాక్ ప్రభావం తో ట్రెండింగ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని ..!

GRK