YSR: వైయస్ గురించి అప్పట్లో మోడీ చెప్పిన హైలెట్ మాట బయట పెట్టిన వైఎస్ విజయమ్మ..!!

Share

YSR: ఈరోజు వైయస్సార్ 12 వ వర్ధంతి సందర్భంగా ఉదయం ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైయస్ కుటుంబ సభ్యులు వైసిపి పార్టీ కీలక నాయకులు కార్యకర్తలు నివాళులర్పించడం తెలిసిందే. అనంతరం హైదరాబాద్ నగరంలో వైఎస్ విజయమ్మ పార్టీలకతీతంగా రాజకీయాలకతీతంగా వైఎస్ సంస్మరణ సభ అంటూ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనిచేసిన అధికారులు.. ఆత్మీయులు మరికొంతమంది కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగం లో భాగంగా వైఎస్ మరణించిన టైంలో అప్పట్లో జాతీయ నాయకులు ఆయన గురుంచి చెప్పిన మాటలు సభలో ప్రస్తావించారు.

RSS defends PM Narendra Modi over National Monetisation Pipeline as  Opposition sharpens attack - The Financial Express

రాజీవ్ గాంధీ అప్పట్లో వైఎస్ గురించి.. ఏపీలో అణువణువునా వైయస్ పేరు మారుమ్రోగుతోంది అని అన్నట్లు తెలిపారు. అనంతరం ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఎస్ చనిపోయిన టైంలో.. వైయస్ కి ఇచ్చిన గౌరవం గురించి మోడీ తమతో ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు. విషయంలోకి వెళితే వైయస్ చనిపోయిన టైంలో.. పార్టీ జెండా గురించి సంతాపం తెలిపినట్లు.. ఈ విధంగా బిజెపి పార్టీలో ఇతర పార్టీల నాయకులు చనిపోతే చేసిన సందర్భం లేదని ఆ ఒక్క ఘనత వైఎస్ కి మాత్రమే ఉందని.. తెలిపినట్లు మోడీ తనతో చెప్పినట్లు వైఎస్ విజయమ్మ ఈ సభలో తెలియజేశారు.

 

ఆ విధంగా ఇతర పార్టీల మన్ననలు కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి పొందుకున్నట్లు.. పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన టైం లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నీ కలిసిన టైంలో.. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని, ఆయన వల్లే మళ్లీ తాను ప్రధానిగా కొనసాగుతున్నట్లు చెప్పినట్లు.. వైయస్ విజయమ్మ ఈ 12వ సంస్మరణ సభలో తెలియజేసి.. సభకు వచ్చిన వారి చేత చప్పట్లు కొట్టించే రీతిలో మాట్లాడారు. వైయస్ గురించి మాట్లాడుతున్న అంతసేపు వైఎస్ విజయమ్మ చాలా భావోద్వేగానికి గురి అవుతూ.. ఆయన మనుషులకు ఇచ్చే మాట గురించి అదే రీతిలో ఇతరుల పట్ల చూపించే ప్రేమ గురించి.. తోటి నాయకుల గురించి అనేక విషయాలు వైఎస్ విజయమ్మ తెలిపారు.


Share

Related posts

ముగ్గురు మొనగాళ్ళు !ఎవరి సత్తా ఎంత ??

Yandamuri

తెలంగాణ‌లో బీజేపీ కొత్త ఆప‌రేష‌న్‌?

sridhar

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

arun kanna